Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీల్లో దగ్గుబాటి కుటుంబం కూడా ఒకటి. అలాంటి ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే హీరోలుగా వెంకటేష్ రానా మంచి పొజిషన్ లో కొనసాగుతున్నారు. ఇందులో వీరిద్దరూ హీరోలుగా ఇండస్ట్రీలో అందరికీ పరిచయమే కానీ ఈ ఫ్యామిలీ నుంచి మిగతా చాలామంది నిర్మాతలుగా ఇతర రంగాలలో రాణిస్తూ వస్తున్నారు.
A fight between Venkatesh Roja
అలా దగ్గుబాటి ఫ్యామిలీలో స్టార్ హీరోగా వెలుగొందింది వెంకటేష్ మాత్రమే. అలాంటి వెంకటేష్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. అందరూ హీరోయిన్లతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతారు.. కానీ ఆయనకు రోజాతో మాత్రమే దాదాపు 25 సంవత్సరాలకు పైగా మాటల్లేవట. దీనికి కారణం ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. వెంకటేష్ ఇండస్ట్రీలోని సిమ్రాన్, సౌందర్య, మీనా లాంటి ఎంతో మంది హీరోయిన్లతో సినిమాల్లో నటించారు. (Venkatesh)
Also Read: Dhanush: వాళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారు.. రాధిక పై ధనుష్ షాకింగ్ కామెంట్స్..?
కానీ రోజాతో మాత్రం గత కొన్నేళ్లుగా సినిమాల్లో నటించడం లేదు.. దీనికి ఒక కారణం కూడా ఉంది.. వెంకటేష్ రోజా కాంబినేషన్ లో పోకిరి రాజా వంటి చిత్రం వచ్చింది. అయితే ఈ చిత్రం తర్వాత తమిళ్ సూపర్ హిట్ అయిన ఒక చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని భావించారట. ఇదే తరుణంలో తమిళ్ లో హీరోయిన్ గా రోజా చేసినటువంటి ఒక చిత్రాన్ని తెలుగులో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని భావించారట. కానీ ఆ టైంలో వెంకటేష్, సౌందర్య కాంబో సూపర్ డూపర్ హిట్ అవుతోంది.
ఇక తమిళ రీమేక్ చిత్రంలో వెంకటేష్ సౌందర్యని తీసుకుంటే బాగుంటుందని నిర్మాతలకు అనిపించి సౌందర్యనే ఫైనల్ చేశారట.. కానీ దీనికంటే ముందు రోజా హీరోయిన్ గా అనుకొని సౌందర్యను ఫైనల్ చేయడంతో, ఎంతో సీరియస్ అయిన రోజా వెంకటేష్ కావాలనే తనను పక్కకు పెట్టేసారని ఆయనపై కోపం పెంచుకుందట. ఇద్దరి మధ్య దాదాపు 25 సంవత్సరాల నుంచి మాటలు లేకుండా గ్యాప్ పెరిగిపోయిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.(Venkatesh)