Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అద్భుతమైన ఆట తీరుతో టీమ్ ఇండియాకు ఎన్నో విజయాలను అందించాడు. ఇక గత కొన్ని రోజుల నుంచి హార్థిక్ పాండ్యాకు దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పాండ్యా వైవాహిక బంధానికి ఇప్పుడు తెరపడింది. గత కొన్ని రోజుల నుంచి హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులు తీసుకుంటున్నట్లు ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. Hardik Pandya

A huge loss of 95 crores to Hardik Pandya

అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు. ఇక రెండు రోజుల క్రితం వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు వారి సోషల్ మీడియా అకౌంట్లలో వెల్లడించారు. హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ అనే నటిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరు వివాహానికి ముందే ఒక మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత గత సంవత్సరం హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో వీరి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఇక వివాహమైన ఏడాదిలోపే వీరు విడాకులు తీసుకున్నారు. వీరికి అగస్త్య అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. Hardik Pandya

Also Read: Hardik Pandya: ఆ అమ్మాయితో బెడ్‌ రూంలో దొరికిపోయిన పాండ్యా..?

ఇక వీరు విడాకులు తీసుకున్నప్పటికీ….. వారి మూడేళ్ల కుమారుడు అగస్త్యకు తల్లిదండ్రులుగా బాధ్యతలు తీసుకుంటామని వెల్లడించారు. అంతేకాకుండా విడాకులు తీసుకోవడం వారికి చాలా కఠినమైన నిర్ణయం అంటూ పేర్కొన్నారు. కలిసి ఉండాలని ఎంతో ప్రయత్నించినప్పటికీ ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని…. నాలుగేళ్ల పాటు కలిసున్న తర్వాత విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని పోస్ట్ చేశారు. ఈ విడాకుల నేపథ్యంలో హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాకు భరణం తన ఆస్తిలో రూ. 95 కోట్లు ఇవ్వాలట. Hardik Pandya

ఇక విడాకులు తీసుకున్న వెంటనే నటాషా తన కుమారుడిని తీసుకొని సెర్బియాకు వెళ్ళిపోయింది. అయితే హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకోవడానికి ఓ బలమైన కారణం ఉందని వార్తలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజుల నుంచి సోలంకి అనే ఓ యువతితో రిలేషన్ కొనసాగిస్తున్నాడని….. ఇక ఆ యువతిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆ యువతితో హార్దిక్ పాండ్యా కొన్ని ఫోటోలను కూడా దిగాడు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కారణంగానే హార్దిక్ పాండ్యా నటాషాకు విడాకులు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. Hardik Pandya