Aamani: ఆమని..సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ప్రత్యేక ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది హీరోలతో జత కట్టింది. అలా అప్పటి హీరోయిన్లందరికీ పోటీ ఇచ్చిన ఆమని కలర్ తక్కువే అయినప్పటికీ ఈమె నటించిన ఎన్నో సినిమాలు ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులు ఇష్టంగా చూస్తారు.. ఇక ఈమె నటించిన శుభలగ్నం సినిమా ఎంత పెద్ద హిట్టో చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ఆమని పాత్రకి చాలామంది ఆడియన్స్ ఫీదా అయ్యారు.
Aamani sensational comments on director
డబ్బు పిచ్చితో డబ్బు కోసం భర్తను అమ్మేసిన నటిగా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. అయితే అలాంటి ఆమనికి ఇండస్ట్రీలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యారట. ఓ డైరెక్టర్ నీకు తొడ మీద పుట్టుమచ్చ ఉందా అని చెప్పి డ్రెస్ విప్పి చూపించమన్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ దానికి ఆమని ఓకే చెప్పక ఆ సినిమా ఆఫర్ వద్దని అక్కడి నుండి వచ్చేసిందట.(Aamani)
Also Read: Suchitra: ఆ డైరెక్టర్ హీరోయిన్లందరినీ వాడుకున్నాడు.. పెద్ద కామపిశాచి..?
ఇక మరో విషయం ఏమిటంటే ఒక డైరెక్టర్ ఆమనికి ఇష్టం లేకున్నా సరే బలవంతంగా దాన్ని పట్టుకోమన్నారట. మరి అది ఏంటి ఎందుకు ఆ డైరెక్టర్ ఆమని ని బలవంత పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం. ఆమని నటించిన జంబలకడిపంబ సినిమా అందరూ చూసే ఉంటారు. అయితే ఈ సినిమాలో ఆమనికి ఇష్టం లేకుండానే సిగరెట్ ని చేతితో పట్టుకోమన్నారట డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ..
కానీ నేను పట్టుకొనని ఆమని ఎంత మొత్తుకున్నా కూడా డైరెక్టర్ వినలేదట. దాంతో ఇష్టం లేకుండానే ఆమని తన చేత్తో సిగరెట్ పట్టుకుని కాలుస్తున్నట్టు యాక్టింగ్ చేసిందట. అంతేకాకుండా ఆమెకు అప్పటివరకు మద్యపానం అలవాటు లేదట.కానీ సినిమా కోసం షాంపైన్ బాటిల్ ని పట్టుకొని నోట్లో పోసుకుందట. కానీ షూట్ అయిపోవడంతోనే ఆ షాంపైన్ ని మొత్తం బయటికి ఊసేసిందట. ఆ సినిమా సమయంలో ఇష్టం లేకుండానే ఆ పని చేశాను అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఆమని.(Aamani)