Abhishek Bachchan: బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ నటీనటుల ఫ్యామిలీ అంటే అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ అని చెప్పవచ్చు. అలాంటి ఈ ఫ్యామిలీ గురించి ఒక్క వార్త బయటకు వచ్చినా సోషల్ మీడియాలో పుంకాను పుంకాలుగా వైరల్ అవుతూ ఉంటుంది. ఆ విధంగానే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడిపోతున్నారని గత కొంతకాలంగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి.
Abhishek Bachchan mother is torturing him
కానీ వీరిద్దరూ మేము కలిసున్నామని చెబుతూ కొన్ని ఫోటోలు రిలీజ్ చేస్తూ ఆ వార్తలకు చెక్ పెడుతున్నారు. అలాంటి ఈ తరుణంలో ఐశ్వర్యరాయ్ తో అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీకి అసలు పడడం లేదని ఒక వార్త బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది.. ఐశ్వర్య రాయిని అభిషేక్ పెళ్లి చేసుకోవడం తన తల్లికి మరియు సోదరికి నచ్చలేదని, వివాహం జరిగిన కొత్తలో అందరూ బాగానే ఉన్నట్టు కనిపించిన ఆ తర్వాత గొడవలు స్టార్ట్ అయ్యాయని చెప్పారు.(Abhishek Bachchan)
Also Read: Ram Charan Game Changer: గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ ప్లాన్స్ మాములుగా లేదు.. దిల్ మామ అదరగొట్టాడు గా!!
దీంతో ఐశ్వర్యారాయ్ వేరే కాపురం పెడదామని కూడా చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. కానీ అభిషేక్ బచ్చన్ మాత్రం ఆ నిర్ణయాన్ని తిప్పి కొట్టారట. ఈ క్రమంలోనే అభిషేక్ బచ్చన్ సోదరీ మరియు తల్లి జయబచ్చన్ ను కలిసి ఐశ్వర్యరాయికి విడాకులు ఇప్పించి కరిష్మా కపూర్ ని పెళ్లి చేయాలని చూస్తున్నారట.. ఎందుకంటే ఐశ్వర్యరాయ్ కంటే ముందే కరిష్మా కపూర్ తో అభిషేక్ బచ్చన్ కు ఎంగేజ్మెంట్ జరిగి కొన్ని కారణాలవల్ల క్యాన్సిల్ అయింది..
దీన్నీ మనసులో పెట్టుకున్న అభిషేక్ తల్లి ఐశ్వర్య రాయిని మొదటి నుంచే విమర్శిస్తూ వస్తుందట. ప్రస్తుతం ఫ్యామిలీలో గొడవలు రావడంతో తప్పకుండా ఐశ్వర్యకు విడాకులు ఇచ్చి కరిష్మా కపూర్ ని పెళ్లి చేసుకోవాలని కొడుకుపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియాలి అంటే స్వయంగా అభిషేక్ బచ్చన్ లేదా ఐశ్వర్య రాయ్ స్పందించాల్సిందే.(Abhishek Bachchan)