Abhishek Bachchan: బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ నిజంగానే హీరోయిన్ ప్రేమించారా.. కేవలం తండ్రి తో రొమా** చేసిందనే ఒకే ఒక్క కారణంతో ఆమెకు బ్రేకప్ చెప్పారా అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ కూడా తండ్రి లాగే సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈయన ఐశ్వర్యరాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకునే కంటే ముందే కరీనాకపూర్ ని ప్రేమించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.కానీ వీరి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యింది. ఇక అంతకు ముందు రాణి ముఖర్జీ అనే హీరోయిన్ ని కూడా ప్రేమించారట.
Abhishek Bachchan not married that heroine because
అయితే వీరిద్దరి మధ్య బ్రేకప్ కి కారణం అమితాబ్ బచ్చన్ అయ్యారని అప్పట్లో బీటౌన్ మొత్తం మాట్లాడుకున్నారు. ఇక దానికి ప్రధాన కారణం ఓ సినిమాలో నటించే సమయంలో అమితాబ్ బచ్చన్ కి రాణి ముఖర్జీలు లిప్ లాక్ ఇవ్వడమే బ్రేకప్ కి కారణం అయినట్టు వార్తలు వినిపించాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. అమితాబ్ బచ్చన్ రాణి ముఖర్జీ సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ సినిమా అప్పట్లో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయింది.(Abhishek Bachchan)
Also Read: Mahesh-Namrata: మహేష్-నమ్రత ల పెళ్లి ఆమె చెడగొడుతుందని భయపడి సీక్రెట్ గా చేసారా.?
అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో అమితాబ్ బచ్చన్ కి రాణి ముఖర్జీ లిప్ లాక్ ఇస్తుంది.అయితే ఇది వేరే విధంగా అర్థం చేసుకోవడానికి లేదు ఎందుకంటే క్లైమాక్స్ లో గురువుని ఓ శిష్యురాలు ప్రేమగా లిప్ లాక్ ఇస్తుంది. అయితే దీనికి అప్పట్లో పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి.కానీ ఈ సీన్ చూసిన అభిషేక్ బచ్చన్,జయా బచ్చన్ లు మాత్రం అస్సలు సహించలేక పోయారట. అయితే క్లైమాక్స్ లో ఈ సీన్ ఎప్పుడైతే చూసాడో అప్పటినుండి రాణి ముఖర్జీకి,అభిషేక్ బచ్చన్ కి మధ్య దూరం పెరిగిందట.
మరీ ముఖ్యంగా ఈ సీన్ గురించి అభిషేక్ బచ్చన్ తనతో మాట్లాడలేదని బాధపడిన రాణి ముఖర్జీ ఇండస్ట్రీ నటుడు అయినప్పటికీ కూడా సినిమాల్లో ఇవన్నీ భాగం అని తెలిసి అభిషేక్ బచ్చన్ అలా ప్రవర్తించడం రాణి ముఖర్జీకి కూడా నచ్చలేదు. దాంతో ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారట.ఇక అప్పట్లో అభిషేక్ బచ్చన్ రాణి ముఖర్జీ పై ఎంత పగ పెంచుకున్నారంటే కనీసం తన పెళ్లికి కూడా పిలవలేదట. ఆ టైంలో ఇండస్ట్రీలో ఉన్న వారందరిని పిలిచి రాణి ముఖర్జీని మాత్రం ఆహ్వానించలేదట.దాంతో వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు పెళ్లి సాక్షిగా బయటపడ్డాయి. ఇక పెళ్లయ్యాక ఐశ్వర్య రాయ్,రాణి ముఖర్జీ ల మధ్య కూడా సత్సంబంధాలు లేవని తెలుస్తోంది.(Abhishek Bachchan)