Abhishek Bachchan: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్లంటే లక్షలాది మందికి ఇన్స్పిరేషన్ గా ఉండేవారు.. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వారు చాలా వరకు మారిపోయారు. పదిమందికి ఇన్స్పిరేషన్ గా ఉండాల్సిన వారే అడ్డదారులు తొక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. పెళ్లిళ్లు చేసుకొని చిన్న చిన్న కారణాలతోనే విడాకులు తీసుకుంటున్నారని చెప్పవచ్చు.. తెలుగు ఇండస్ట్రీలో నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత ఎన్నో జంటలు విడాకుల బాట పట్టాయి..
Abhishek Bachchan who got his girlfriend pregnant
అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా ఇప్పటికి ఎంతోమంది విడాకులు తీసుకొని విడిపోయి ఎవరికి వారు బ్రతుకుతున్నారు. అలాంటి ఈ తరుణంలో బాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందినటువంటి ఐశ్వర్యరాయ్ అభిషేక్ దంపతులు కూడా విడిపోతున్నారని గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి.. ఈ వార్తలకు ప్రధాన కారణం ఐశ్వర్య రాయ్ సింగిల్ గా ఫారెన్ ట్రిప్స్ కి వెళ్లడం, ఆమె విదేశాల నుంచి ఇండియాకు వచ్చి ఎయిర్పోర్టుకు బచ్చన్ ఫ్యామిలీ నుంచి ఎవరూ రాకపోవడం చూసి వీరి మధ్య విభేదాలు వచ్చాయని త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి..(Abhishek Bachchan)
Also Read: Anchor: అర్ధరాత్రి యాంకర్ కి కాల్స్.. హాట్ బ్యూటీ నీ రేటెంత..?
ఈ విడాకుల వార్తలపై ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ క్లారిటీ ఇస్తూ వారు కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నా ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు.. ఇక ఇదే తరుణంలో మరో సంచలన వార్త ట్రెండ్ అవుతుంది. అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ తో సన్నిహితంగా ఉంటున్నారని, వీరిద్దరూ కలిసి దస్వి అనే సినిమాలో నటించారని, ఈ టైంలోనే వీరి మధ్య స్నేహం ఏర్పడిందని ఆ ఫ్రెండ్ షిప్ మరింత పెరిగి రిలేషన్స్ స్థాయికి చేరుకుందని తెలియజేశారు.
ఇదిలా ఉండగానే వీరి మధ్య సన్నిహిత్యం వల్ల నిమ్రత్ కౌర్ గర్భవతి కూడా అయిందని ఆమె త్వరలోనే ఒక బిడ్డకు జన్మనివ్వబోతుందని కూడా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అంతే కాదు కొంతమంది ఆకతాయిలు పుట్టబోయేది మగ బిడ్డ అంటూ కూడా వార్తలు రాస్తూ వస్తున్నారు. మన ఇండియన్ చట్టాల ప్రకారం కడుపులో ఉన్నది మగ బిడ్డ ఆడబిడ్డ అనేది ఎవరు కూడా చెప్పరు. కానీ వీరు డైరెక్టుగా మగ బిడ్డ అని చెప్పడంతో ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అర్థమవుతోంది.(Abhishek Bachchan)