Sunil: సినిమా ఇండస్ట్రీలో ఎవరికి క్రేజ్ ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం కష్టం. ప్రతి ఒక్కరూ తమ పనిని చక్కగా చేస్తేనే ఇక్కడ విజయం సాధిస్తామని అందరూ అంటారు. అయితే కొంతమందికి సినిమాలపై ఆసక్తి ఉండి, ఏదో ఒక రంగంలో తమ ప్రతిభ కనబరచాలనుకునే వారికి ఇక్కడ మరో విధంగా అవకాశాలు దక్కుతాయి. హీరోలు కావాలనుకునే వారు విలన్లు, కమెడియన్లు విలన్లు అవుతుంటారు.. ఇలా నిజజీవితంలో చాలా జరిగాయి. ఇప్పటికే కమెడియన్స్‌గా స్టార్డమ్తో దూసుకుపోతున్న వారు తమ కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్లుగా చేస్తున్నారు.
Actor Sunil Take High Remuneration Than Heroes
టాలీవుడ్ స్టార్ కమెడియన్లలో సునీల్ ఒకరు. అతని కామిక్ టైమింగ్ బాగుంటుంది. తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సునీల్ లేనిదే సినిమా రాదు అన్నట్టు అప్పట్లో అనుకునేవారు. అయితే ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ హీరో కావాలని కోరుకుంటారు. అలాగే సునీల్ కూడా హీరో కావాలనే తపనతో కమెడియన్ గా చేస్తూనే హీరో గా అవకాశం రాగా అవి చేశాడు.
ఒకట్రెండు సినిమాలకు ఓకే అనిపించినా ఆ తర్వాత సునీల్ హీరోగా సక్సెస్ కొట్టలేకపోయాడు. అందుకే అయన మళ్ళీ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. సడన్ గా విలన్ గా నటించడం మొదలుపెట్టాడు సునీల్. సునీల్ విలన్ గా చేసిన సినిమాల విజయం అందుకోవడంతో మళ్లీ మళ్లీ అలాంటి పాత్రలే వస్తున్నాయి. సునీల్ తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి నెగెటివ్ పాత్రలు పోషించాడు. తాజాగా విలన్ గా మలయాళం లో కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. (Sunil)
అంతేకాదు విలన్ గా సునీల్ పారితోషికం కూడా భారీగానే ఉంటుందని అంటున్నారు. కమెడియన్‌గా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు కూడా సునీల్‌కు మంచి పారితోషికం అందుకునే వాడు. హీరోగా మారిన తర్వాత కూడా అతను అందుకున్న డబ్బు భారీగానే ఉంది. అలా ప్రస్తుతం సునీల్ విలన్ గా తీసుకున్న రెమ్యూనరేషన్ వాటిని మించి ఉంటుందని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సునీల్ తన కెరీర్ లోనే పీక్స్ లో ఉన్నట్లు తెలుస్తుంది.