Actress in the third stage.. treatment started

Actress: బాలీవుడ్ బ్యూటీ హినా ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇటీవల క్యాన్సర్ బారిన పడినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. హాయ్.. మీ అందరితో ఓ ఇంట్రెస్టింగ్ విషయం పంచుకోబోతున్నాను. నాకు బ్రెస్ట్ క్యాన్సర్. ప్రస్తుతం అది మూడో స్టేజ్లో ఉంది. ఇప్పటికే ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను.

ఇక ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోల్కుంటానని ఎంతో ధైర్యంగా అంటూ నమ్మకంగా ఉన్నాను.. అంటూ తన పరిస్థితిని వివరించింది ఈ బ్యూటీ. ఇక తాజాగా ఆమెకి ట్రీట్మెంట్కు సంబంధించిన మరో పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ మేరకు మొదటి కీమో సెషన్ తో చికిత్స ప్రారంభించిన ఈమె రొమ్ము క్యాన్సర్ నుంచి త్వరగా అండ్ పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.. అంటూ ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫల్ ఫోటోలు షేర్ చేసింది బాలీవుడ్ మీడియా.

Actress in the third stage.. treatment started

ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో త్వరగా కోలుకోవాలని బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు ప్రేక్షకులు. కాగా ఈమె.. హాయ్ రిస్తా క్యా ఖేల్తా హై.. అనే సీరియల్ ద్వారా బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సీరియల్ తెలుగులో.. పెళ్లంటే నూరేళ్ల పంట అనే పేరుతో డబ్ అయ్యింది. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.