Aishwarya Rai: ఈమధ్య సినీ ఇండస్ట్రీ జంటలకు ఏమైందో ఏమో కానీ చిన్నచిన్న కలతలకే బంధాలు తెంచుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు.. చివరికి విడాకులు తీసుకొని పిల్లల్ని ఒంటరి వారిను చేస్తున్నారు. అలా ఈ మధ్యకాలంలో విడిపోయిన వారిలో సమంత నాగచైతన్య, ఐశ్వర్య ధనుష్ లు ముందు వరుసలో ఉన్నారు. ఇదే బాటలోకి అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ లు రాబోతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుని వేరువేరుగా ఉంటారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి.
Aishwarya Rai Abhishek Divorce
ఎంతో అన్యోన్యంగా జీవించే వీరి మధ్య కలతలు ఎందుకు ఏర్పడ్డాయి. వీరి దాంపత్యంలో వేలు పెట్టిన మరో అమ్మాయి ఎవరు అనే వివరాలు ఏంటో చూద్దాం.. సోషల్ మీడియాలో అందిన సమాచారం ప్రకారం..ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి అభిషేక్ బచ్చన్ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిందట. దస్వీ మూవీ షూటింగ్ సమయంలో నిమ్రత్ కౌర్ తో అభిషేక్ బచ్చన్ కు మంచి పరిచయం ఏర్పడిందట. అది కాస్త ఇద్దరి మధ్య చాలా దగ్గరి బంధం అవ్వడంతో కొంతకాలం నుంచి ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని తెలుస్తోంది. (Aishwarya Rai)
Also Read: Pushpa 2: “పుష్ప 2″లో అల్లు అర్జున్ హీరో కాదా.. విలన్ రోల్ చేస్తున్నాడా?
అంతేకాకుండా అభిషేక్ బచ్చన్ కూడా ఈ మధ్యకాలంలోనే ఐశ్వర్యని తరచు అనుమానిస్తుండడం, తనకు తానే ఇన్ సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారని సమాచారం. దీనికి తోడు ఆయన సినిమాలు తరచూ ఫ్లాప్ అవ్వడంతో ఐశ్వర్యని చూస్తేనే చిరాకు పడుతున్నారట. ఈ క్రమంలోనే నిమ్రత్ కౌర్ తో ఆయనకు పరిచయం ఏర్పడి అది కాస్త ఇద్దరి మనసులు కలిసేలా చేయడంతో ఐశ్వర్యను కాస్త దూరం పెడుతూ వస్తున్నారని సమాచారం.
ఇలా అభిషేక్ నిమ్రత్ ల మధ్య పరిచయం ఎక్కువవ్వడంతో ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ రిలేషన్ ని నిమ్రత్ కౌర్ చాలా సీరియస్గా తీసుకున్నారని, ఇది గమనించినటువంటి అభిషేక్ బచ్చన్ తన తప్పును గ్రహించి ఆమెతో సంబంధం తెంచుకోవడానికి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా వీరి విడాకుల విషయంపై మాత్రం ఇద్దరు ఎప్పుడూ కూడా అఫీషియల్ గా స్పందించలేదు. సోషల్ మీడియాలో మాత్రమే ఈ వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిపై ఐశ్వర్య అభిషేక్ దంపతులు ఎలాంటి క్లారిటీ ఇస్తారో అప్పుడు ఈ వార్తలకు చెక్ పడే అవకాశం ఉంది.(Aishwarya Rai)