Aishwarya Rai: ఏంటి ఇండస్ట్రీలో వినిపిస్తున్న మ్యాటర్ నిజమేనా.. ఐశ్వర్య కి కూతురు ఆరాధ్య భచ్చన్ మాత్రమే కాదు ఓ కొడుకు కూడా ఉన్నాడా. ఆ కొడుకు ఐశ్వర్య రాయ్ కి పెళ్లి కాకుండానే పుట్టాడా.. ఇంతకీ ఐశ్వర్యరాయ్ కొడుకును అంటూ తెరమీద కనిపిస్తున్న ఆ అబ్బాయి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. ఐశ్వర్య రాయ్ కి పెళ్లి కాకుండానే కొడుకు పుట్టాడు అంటూ గత కొద్ది రోజుల నుండి మీడియాలో ఒక అబ్బాయి ఫోటో చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు..
Aishwarya Rai has not only a daughter but also a son
ఆయన ఐశ్వర్య రాయ్ కొడుకును అంటూ తెరమీదికి రావడానికి వెనుక ఉన్న నిజం ఏంటి అనేది చూద్దాం. ఐశ్వర్య రాయ్ 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ల్యాబ్ లో ఐవీఎస్ ద్వారా నేను పుట్టాను అంటూ సంగీత్ కుమార్ అనే వ్యక్తి తెరమీదకి వచ్చి రచ్చ రచ్చ చేసారు.అయితే ఈ ఘటన జరిగింది మూడేళ్ల క్రితం. కానీ ఇప్పటికి కూడా ఈ విషయం బీటౌన్ లో చక్కర్లు కొడుతూనే ఉంది. (Aishwarya Rai)
Also Read: Prashanth Neel: ప్రశాంత్ నీల్ కు ఫస్ట్ ఫ్లాప్.. భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!!
ఓ అబ్బాయి మీడియా ముందుకు వచ్చి ఐశ్వర్య రాయ్ కి నేను పుట్టానని,నేను ఐవిఎఫ్ ద్వారా ల్యాబ్ లో పుట్టానని,అయితే ఐశ్వర్య రాయ్ లండన్ లో ఉన్నప్పుడు 15 ఏళ్ల వయసులోనే ఐవిఎఫ్ ద్వారా నాకు జన్మనిచ్చిందని, కానీ ఆ తర్వాత ఐశ్వర్య రాయ్ పేరెంట్స్ నన్ను విశాఖపట్నం తీసుకువచ్చి ఇక్కడే పెంచారని, నేను ఐశ్వరరాయ్ కొడుకును అని చెప్పడానికి ఎలాంటి ఆధారం కూడా ఉంచలేదు అన్ని నాశనం చేశారంటూ సంగీత్ కుమార్ అనే వ్యక్తి మీడియాలో పెద్ద దుమారం సృష్టించారు.
అయితే ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆయన వయసు 32 ఏళ్లు.. ఇక ఈ విషయంలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో పోలీసులు ఆ వ్యక్తి గురించి ఎంక్వయిరీ చేయగా ఆయనకు మతిస్థిమితం లేదు అని అందుకే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అని అర్థమైంది. దీంతో ఐశ్వర్య అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.(Aishwarya Rai)