Aishwarya Rai: సినిమా ఇండస్ట్రీలో నటులుగా చేసే వాళ్లపై ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక స్టార్ నటులపై ఈ వార్తలు మరింత ఎక్కువగా వస్తాయి. ఆ విధంగానే ఐశ్వర్యరాయ్ పై అప్పట్లో వచ్చినటువంటి ఒక రూమర్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఆ వివరాలు చూద్దాం.. అయితే ఐశ్వర్యరాయ్ కాఫీ విత్ కరన్ షోలో పాల్గొన్నప్పుడు తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి రివిల్ చేసింది.
Aishwarya Rai in the hotel room with that Bollywood hero
నా జీవితంలో అదొక చెత్త రూమర్ దానిపై నేను కోర్టులో కేసు కూడా వేసానని చెప్పింది. ఇంతకీ అది ఏంటంటే నేను హీరో అక్షయ్ కుమార్ తో ఒక హోటల్ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్నామని, ఆ విషయం తెలిసి అక్షయ్ ప్రియురాలు రవినా టండాన్ అక్కడ పెద్ద గొడవ చేసిందని, వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చెంప చెల్లుమనిపించింది అంటూ అప్పట్లో ఒక మ్యాగజిన్ లో వార్త వచ్చింది. (Aishwarya Rai)
Also Read: Balakrishna: కారులో ఆ పని చేసిన బాలయ్య.. ఇంకోసారి కారు ఎక్కను బాబోయ్ అంటూ దడుచుకున్న శ్రియా.?
దీన్ని చూసిన నాకు చాలా కోపం వేసి వెంటనే మ్యాగజిన్ పై కేసు పెట్టాను.. ఇక ఈ వార్త విషయం పక్కన పెడితే ఐశ్వర్యరాయ్ అక్షయ్ కుమార్ తో ఉంటే రవినాకు ఏంటి నొప్పి అని చాలామందికి అనుమానం వస్తుంది. అక్షయ్ కుమార్ ట్వింకిల్ కన్నాను వివాహం చేసుకోక ముందే రవినాతో లవ్ లో ఉన్నారు. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అనుకోకుండా ట్వింకిల్ ను పెళ్లి చేసుకున్నారు.
అయితే వీరిద్దరు లవ్ లో ఉన్న సమయంలో అక్షయ్ కుమార్ ఐశ్వర్యరాయ్ తో ఉన్నాడనే కోపంతో ఊగిపోయిన రవినా హోటల్ రూమ్ కి వెళ్లి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందని బాలీవుడ్ లో చర్చ దారుణంగా నడిచింది. ఇందులో ఏమాత్రం నిజం లేదని ఈ ఫేక్ వార్త క్రియేట్ చేసిన వారిపై నేను కేసు కూడా వేశానని ఐశ్వర్య ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ టైంలో ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Aishwarya Rai)