Akkineni Nagarjuna: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ను అరెస్టు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్ కన్వెన్షన్ పేరుతో అక్కినేని నాగార్జున ను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు రంగం సిద్ధం చేశారట. ప్రస్తుతం సమంతా అలాగే అక్కినేని నాగచైతన్య విడాకుల గురించి.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. Akkineni Nagarjuna
Akkineni Nagarjuna may be arrest revanth reddy sketch
ఈ అంశంపై అక్కినేని నాగార్జున పోరాటం చేస్తున్నారు. ఆయనకు సపోర్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా దిగి వచ్చింది. దీంతో బహిరంగంగా తనకు క్షమాపణలు చెప్పాలని.. కోర్టులో కేసు కూడా వేశారు అక్కినేని నాగార్జున. ఏకంగా 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు అక్కినేని నాగార్జున. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి.. చుక్కెదురు అయ్యేలా కనిపిస్తోంది. అయితే ఈ డ్యామేజ్ ను కంట్రోల్ చేసేందుకు రేవంత్ రెడ్డి… ఓ సామాజిక వేత్తతో… అక్కినేని నాగార్జున పై కేసు పెట్టించారట. Akkineni Nagarjuna
Also Read: Jagan: వైసీపీ నుంచి సజ్జల బహిష్కరణ ?
ఎన్ కన్వెన్షన్ స్థలాన్ని అక్కినేని నాగార్జున దౌర్జన్యంగా కబ్జా చేశాడని… మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. అయితే ఈ కేసును వెంటనే విచారణ చేసి అక్కినేని నాగార్జునకు నోటీసులు ఇవ్వాలని అనుకుంటున్నారట పోలీసులు. అవసరమైతే ఆయనను అరెస్టు చేసేందుకు కూడా వెనకాడడం లేదట రేవంత్ రెడ్డి సర్కార్. కాగా ఇప్పటికే నోటీసులు ఇవ్వకుండా ఎం కన్వెన్షన్ ను రేవంత్ రెడ్డి సర్కార్ కూల్చిన సంగతి తెలిసిందే. Akkineni Nagarjuna