Allu Aravind: గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా స్టార్ నిర్మాతగా మారిన అల్లు అరవింద్ తన ఇద్దరు కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. పెద్దకొడుకు తన బాటలోనే నిర్మాతగా చేస్తుంటే ఇద్దరు కొడుకులు హీరోలుగా చేస్తున్నారు. ఇక ఈ ముగ్గురు కొడుకుల్లో అల్లు అర్జున్ మాత్రమే స్టార్ హీరోగా ఎదిగారు. అయితే అలాంటి అల్లు అరవింద్ ఆ సినిమా చూసి తన కొడుకు జీవితం నాశనం అంటూ డైరెక్టర్ ని అవమానించారట.మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఇంతకీ ఏ సినిమా గురించి మాట్లాడుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి. ఈ మూవీకి రాఘవేంద్ర దర్శకత్వం వహించారు.
Allu Aravind insulted that director
అయితే ఇది రాఘవేంద్రరావుకి చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా.ఎందుకంటే అది ఆయన 100వ సినిమా. దాంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గంగోత్రి మూవీ ని తెరకెక్కించారు. అయితే సినిమా విడుదలకు ముందు ఈ సినిమాని తెరమీద వేసి కొంతమందికి చూపించారట.అయితే వాళ్ల నుండి కాస్త నెగటివ్ రెస్పాన్స్ వచ్చిందట.ఇదే మూవీ ని అల్లు అరవింద్ కి చూపించగా.. ఇదేం సినిమా.. అస్సలు బాగాలేదు.ఈ సినిమా చూస్తే నా కొడుకు కెరియర్ ఇక్కడితో క్లోజ్ అవుతుంది.. గంగోత్రి మూవీ విడుదలయితే నా కొడుకు సినీ కెరియర్ నాశనం అవుతుంది. ఇదే వాడి మొదటి సినిమా..(Allu Aravind)
Also Read: Venkatesh: వెంకటేష్ అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాడబ్బా!!
ఈ సినిమా ఇలా ఉంది ఏంటి అని డైరెక్టర్ రాఘవేంద్రరావుని అవమానించారట. దాంతో రాఘవేంద్రరావు ఇదేంటి అందరూ ఇలా మాట్లాడుతున్నారు. అసలు బాగానే తీశాను కదా అని ఆయనలో ఆయనే మదన పడ్డారట. ఆ తర్వాత మళ్లీ ఈ స్టోరీని చెప్పగా మీరు స్టోరీ చెబుతున్నప్పుడు బాగానే ఉంది కానీ తెరమీద చూస్తేనే అస్సలు బాగాలేదు అని అన్నారట. అయితే ఫైనల్ గా మిక్సింగ్ చేసి వారెవరి మాటలు పట్టించుకోకుండా చివరికి థియేటర్లో విడుదల చేశారట.
ఇక సినిమా మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దాంతో రాఘవేందర్రావు చాలా సంతోషించారు.కానీ అప్పుడు వాళ్ళందరూ అన్న మాటలను తలుచుకొని ఒకవేళ ఈ సినిమాలో ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే సినిమా పోయేది.అల్లు అర్జున్ కూడా నా సినిమాతో స్టార్ అయ్యే వాడు కాదు. అలా వాళ్ళ మాటలు నమ్మకుండా నా మీద నేను నమ్మకం పెట్టుకొని ఈ సినిమా రిలీజ్ చేసి రిజల్ట్ చూసి చాలా ఆనందపడ్డాను అంటూ రాఘవేంద్రరావు సౌందర్య లహరి అనే ప్రోగ్రాంలో ఈ విషయాన్ని బయటపెట్టారు.(Allu Aravind)