Allu Arjun: ఏంటి నిజంగానే అల్లు అర్జున్ తండ్రి తో గొడవ పెట్టుకొని వేరు కాపురం పెట్టబోతున్నాడా.. టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల్లో ఎంత నిజముంది అనేది ఇప్పుడు చూద్దాం.. గత కొద్ది రోజులుగా మెగా,అల్లు కుటుంబాల మధ్య జరుగుతున్న వార్ గురించి మనకు తెలిసిందే.అల్లు అర్జున్ తన ఫ్రెండుకి మద్దతు పలకడం,నాగబాబు ట్వీట్ చేయడం, సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ని స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడం.
Allu Arjun: Differences with father
ఉపాసన బర్త్‌డేకి స్నేహ రెడ్డి విష్ చేయకపోవడం, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ నీ ఉద్దేశించి పరోక్ష కామెంట్లు పుష్ప సినిమా గురించి చేయడం,అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య వార్, అల్లు అర్జున్ నా ఫ్రెండ్స్ కోసం నా అన్న వాళ్ల కోసం ఎక్కడికైనా వెళ్తారని ఓ ఈవెంట్ లో మాట్లాడడం,అల్లు అర్జున్ మామ పవన్ కళ్యాణ్ మాటలు వెనక్కి తీసుకోవాలని మాట్లాడం ఇవన్నీ సోషల్ మీడియాలో ఎంత చర్చనీయాంశంగా మారుతున్నాయో చెప్పనక్కర్లేదు. (Allu Arjun)
Also Read: Taapsee: ఆ హీరోయిన్ భర్త తో తాప్సీ ఎఫై**.. నిజమేనా..?
ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఎక్కువ దూరం పెరుగుతుందని భావించిన అల్లు అరవింద్ వెంటనే ఈ గొడవలు పక్కన పెట్టేసి అందరితో కలిసి పోవాలి అని అల్లు అర్జున్ ని మందలించినట్టు తెలుస్తోంది.కానీ అల్లు అర్జున్ మాత్రం అందులో నేను చేసిన తప్పేమీ లేదు. నా ఫ్రెండ్స్ కోసమే నేను వెళ్ళాను. కానీ వాళ్లే తప్పుగా అర్థం చేసుకున్నారు అని తండ్రి పైన ఎదురు తిరిగారట.దాంతో తండ్రికి అల్లు అర్జున్ కి మధ్య కాస్త విభేదాలు వచ్చి అల్లు అర్జున్ వెంటనే తన మకాన్ని మార్చేసి భార్య పిల్లలతో వేరు కాపురం పెట్టడానికి రెడీ అయ్యారట.
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో అల్లు అర్జున్ తన ఇంటి నుండి మాదాపూర్ కి మకాం మారుస్తున్నాడని వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే సడన్ గా ఇంటి నుండి జూబ్లీహిల్స్ వెంకటగిరిలో ఒక లగ్జరీ ఇల్లును సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.ఇక ఈ ఇల్లు కృష్ణంరాజు ఇంటికి దగ్గరలోనే ఉన్నట్టు సమాచారం. అలా తండ్రితో విభేదాల కారణంగా అల్లు అర్జున్ ఇంటి నుండి బయటకు వచ్చి వేరు కాపురం పెట్టబోతున్నట్టు టాలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ బయటికి మాత్రం అలాంటిదేమీ లేదు అనే ప్రచారం జరుగుతుంది.(Allu Arjun)