Allu Arjun Receives Relief from Election Violation Allegations

Allu Arjun: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఇటీవల ఎన్నికల సమయంలో నంద్యాలలో జరిగిన ఓ సంఘటనలో ఎన్నికల నియమాలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. అయితే, ఈ కేసులో ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరగలేదని హైకోర్టు నిర్ధారించడంతో ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ తీర్పు ఎన్నికల సమయంలో వ్యక్తిగత పర్యటనలు, రాజకీయ పరంగా ఉద్దేశపూర్వకంగా జరిగే పర్యటనల మధ్య తేడాను స్పష్టంగా చూపించింది.

Allu Arjun Receives Relief from Election Violation Allegations

అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి షిపా రవిని వ్యక్తిగతంగా కలిసి అభినందించడానికి నంద్యాలకు వెళ్లారు. రవికి మద్దతుగా వెళ్లారన్న ఆరోపణలతో, అర్జున్ పర్యటన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిందని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనధికార సభ నిర్వహించారన్న కారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు పెట్టారు. ఈ పర్యటన కారణంగా భారీగా అభిమానులు రవి నివాసం వద్ద చేరుకోవడం, శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించిందని పోలీసులు ఆరోపించారు.

Also Read: Niharika: ఆ హీరోయిన్ ఫ్రెండ్ తో నిహారిక భర్త రెండో పెళ్లి ఫిక్స్.?

అయితే, ఈ పర్యటన రాజకీయ ఉద్దేశాల కోసం కాదని, పూర్తిగా వ్యక్తిగత పర్యటనగా మాత్రమే జరిపామని అర్జున్, రవిలు తమ వాదనలు న్యాయస్థానంలో వినిపించారు. అభిమానులు స్వచ్ఛందంగా అర్జున్‌ను కలవడానికి తరలివచ్చారే తప్ప, తమకు ఎలాంటి ఉద్దేశ్యం లేదని పేర్కొన్నారు. వీరి వాదనలను పరిశీలించిన హైకోర్టు, కేవలం వ్యక్తిగతగా వెళ్లిన పర్యటనకు ఎన్నికల కోడ్ అతిక్రమణ అన్వయించదని తేల్చింది.

హైకోర్టు తీర్పుతో అల్లు అర్జున్‌కి న్యాయపరంగా ఎదురవుతున్న ఈ సమస్య నుంచి విముక్తి లభించింది. ఈ తీర్పు తర్వాత ఆయన తన రాబోయే ప్రాజెక్టులపై పూర్తి దృష్టి సారించేందుకు వీలైంది. ప్రస్తుతం “పుష్ప” సీక్వెల్‌తో పాటు ఆయన చేయబోయే చిత్రాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.