Amit Mishra: ఐపీఎల్ లో ఐదు టైటిల్స్ అందుకున్న తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ జట్టును నిలబెట్టాడు. రోహిత్, కోహ్లీ ఇద్దరు మంచి ఆటగాళ్లే. అయిన వారి కెప్టెన్సీ స్టైల్ ఎలా ఉంటుందనేది ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా ఇదే అంశంపై మాజీ ప్లేయర్ అమిత్ మిశ్రా స్పందించాడు. కెప్టెన్ అయ్యాక విరాట్ కోహ్లీలో చాలా మార్పులు వచ్చాయి అంటూ చెప్పాడు. ప్లేయర్ గా కోహ్లీని చాలా గౌరవిస్తానంటూ చెప్పాడు. ఆటగాడిగా ఉన్నప్పుడు స్టార్ ప్లేయర్ తో తాను చాలా సరదాగా ఉండేవాడినని అన్నాడు. Amit Mishra
Amit Mishra Comments On Virat Kohli
కానీ కోహ్లీ కెప్టెన్ అయ్యాక అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని అన్నాడు. కెప్టెన్సీకి ముందు…. కెప్టెన్సీకి తర్వాత అనుకునేలా కోహ్లీ ప్రవర్తించాడని అన్నాడు. ఒకప్పటిలాగా విరాట్ కోహ్లీతో తాను సన్నిహితంగా ఉండలేకపోయాను అన్నాడు. ఇద్దరం దాదాపుగా మాట్లాడుకోవడమే మానేశామని చెప్పాడు. 14 ఏళ్ల వయసు నుంచి నాకు విరాట్ కోహ్లీ తెలుసు. Amit Mishra
కానీ తనకు తెలిసిన కోహ్లీకి…. కెప్టెన్ కోహ్లీకి చాలా తేడా ఉందని చెప్పాడు. కొందరు పేరు, గుర్తింపు వచ్చిన తర్వాత ఏదో బెనిఫిట్ కోసమే ప్రజలు తమ వద్దకు వస్తారని భావిస్తారని అన్నారు. తాను మాత్రం అలాంటి జాబితాలో ఉండనని చెప్పారు. విరాట్ కోహ్లీకి అందుకే తక్కువ మంది స్నేహితులు ఉన్నారన్నట్టుగా మాట్లాడాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఎప్పుడూ ఒకేలాగా ఉన్నాడని…. అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు. హిట్ మ్యాన్ ను నేను కలిసిన తొలిరోజు ఎలా ఉన్నాడో ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాడు. Amit Mishra
ఐపీఎల్ లో కానీ…. ఏదైనా ఈవెంట్లో కానీ కలిసినా రోహిత్ చాలా సరదాగా మాట్లాడతాడని గుర్తు చేసుకున్నాడు. హిట్ మ్యాన్ జోకులు కూడా వేస్తాడు. కెప్టెన్సీ వచ్చిన తర్వాత కూడా రోహిత్ స్వభావంలో ఎలాంటి మార్పు రాలేదని అన్నాడు. టీ20 వరల్డ్ కప్, 5 ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన హిట్ మ్యాన్ వరల్డ్ నెంబర్ వన్ కెప్టెన్ అని అన్నాడు. ప్రస్తుతం అమిత్ మిశ్రా చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. Amit Mishra