Amitabh Bachchan: ఏంటి అమితాబ్ బచ్చన్ కొడుకు కాపురంలో చిచ్చు పెట్టారా..ఇంతకీ అమితాబ్ బచ్చన్ చేసిన తప్పేంటి.. ఎందుకు అభిషేక్ బచ్చన్ కాపురంలో చిచ్చుపెట్టాడు అని వార్తలు వస్తున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. కొద్ది రోజులుగా ఐశ్వర్య అభిషేక్ డివోర్స్ తీసుకోబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలకి మరింత ఆజ్యం పోసేలా నటి నిమ్రత్ కౌర్ తో అభిషేక్ బచ్చన్ ఎఫైర్ పెట్టుకున్నారని, ఈ ఎఫైర్ తెలిసే ఐశ్వరరాయ్ ఇంట్లో గొడవపడి భర్తకు దూరంగా ఉంటున్నారనే రూమర్ కూడా వినిపించింది.
Amitabh Bachchan shocking tweet on Nimrath kour
అయితే ఈ రూమర్ నిజమే అనేలా అగ్నికి ఆజ్యం పోసేలా అమితాబ్ బచ్చన్ చేసిన పోస్టు మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.మరి ఇంతకీ ఆ పోస్ట్ ఏంటయ్యా అంటే..అమితాబ్ బచ్చన్ నిమ్రత్ కౌర్ నటించిన సినిమాలో ఆమె నటన చూసి ఇంప్రెస్ అయ్యారు. దాంతో అప్పట్లో ఓ లేఖ రాశారు.ఆ లేఖలో ఏముందంటే.. నేను నిన్ను స్వయంగా కలిసి మాట్లాడింది చాలా తక్కువ.మనమిద్దరం క్యాడ్బరీ యాడ్ కోసం కలిసాం. కానీ దస్వి మూవీలో నీ నటన చూసి నేను ఎంతగానో ఇంప్రెస్ అయ్యాను. (Amitabh Bachchan)
Also Read: Sai Pallavi: సాయి పల్లవిని అర్ధరాత్రి హింసించిన హీరో.. మరీ అంత దారుణమా.?
ఈ సినిమాలో నీ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంది అంటూ నిమ్రత్ కౌర్ ని పొగుడుకుంటూ అమితాబ్ బచ్చన్ లెటర్ రాశారు.అయితే ఆయన రాసిన లెటర్ కి ఎమోషనల్ అవుతూ నిమ్రత్ కౌర్ కూడా రిప్లై ఇచ్చింది.నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడే ఎప్పడో ఒకసారి అమితాబ్ బచ్చన్ కి నా పేరు గుర్తుంటుంది అనుకున్నాను. అలాగే జరిగింది. మిమ్మల్ని కలుసుకోవాలని చాలా సంవత్సరం నుండి అనుకున్నాను. అది కూడా నెరవేరింది. మీరు ఇచ్చిన ఈ కాంప్లిమెంట్ నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.
అంటూ నిమ్రత్ కౌర్ రిప్లై ఇచ్చింది.అయితే దస్వి మూవీలో యామి గౌతమ్, నిమ్రత్ కౌర్, అభిషేక్ బచ్చన్ లు నటించారు. ఈ సినిమా సమయంలోనే నిమ్రత్ కౌర్ నటనకి ఫిదా అయిన అమితాబ్ బచ్చన్ ఈ లేఖ రాశారు. అయితే అప్పటి లెటర్ ఇప్పుడు వైరల్ అవ్వడంతో ఈ సినిమా షూట్ లోనే అభిషేక్ బచ్చన్ నిమ్రత్ కౌర్ ల మధ్య ప్రేమాయణం చిగురించింది కావచ్చు. అందుకే కాబోయే కోడలికి మద్దతు పలుకుతూ ఇన్ డైరెక్ట్ గా కోడల్ని మెచ్చుకుంటూ అమితాబ్ బచ్చన్ లెటర్ రాశారు అంటూ ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్.(Amitabh Bachchan)