Ananya Nagalla: టాలీవుడ్ యువ నటి అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తక్కువ సినిమాల్లో నటించినా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో ఆమె విజయవంతమైంది. తెలంగాణకు చెందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. 2019లో వచ్చిన “మల్లేశం” సినిమాతో అనన్యకు మంచి పేరు వచ్చింది. ఆ చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. ఆ తర్వాత “ప్లే బ్యాక్”, “వకీల్ సాబ్”, “మాస్ట్రో”, “ఊర్వశివో రాక్షసివో”, “శకుంతలం” వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించింది.
Ananya Nagalla Addresses Casting Couch Rumors
తాజాగా అనన్య “పొట్టేలు” అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనన్య ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది. ఒక ఇంటర్వ్యూలో, ఆమెను కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించగా, ఆమె ధీటుగా సమాధానం ఇచ్చింది. “నేను ఇప్పటివరకు అలాంటి వేధింపులేమీ ఎదుర్కోలేదు,” అని ఆమె పేర్కొంది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది 100% అబద్ధమని తన అనుభవం ద్వారా చెబుతున్నానని తెలిపింది.
Also Read: Sreeleela: విహారయాత్రలో బాయ్ ఫ్రెండ్ తో చిందులేస్తున్న శ్రీలీల!!
ఇతరుల పరిస్థితులు తనకు తెలియదని, కానీ తన విషయానికే విషయానికి వచ్చినప్పుడు అలాంటి ఏమీ జరగలేదని వివరించింది. “అవకాశం ఇచ్చే ముందు కమిట్మెంట్ అడగడం అవాస్తవం” అని కూడా స్పష్టం చేసింది. అదేవిధంగా, సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి అనన్య మాట్లాడుతూ, “ట్రోలింగ్ లో 50% మంచి, 50% చెడు ఉంటాయి” అని అభిప్రాయపడింది. అంతేకాక, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆమె మాట్లాడింది. ఆయన పెద్ద స్టార్ హీరోగా, మహిళల కోసం పోరాడే వ్యక్తిగా అనన్య కొనియాడింది.