Andhra Home Minister Vangalapudi Anita Calls for Justice

Vangalapudi Anita: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన చిన్నారిపై హత్యాచార ఘటన రాష్ట్రాన్ని కలిచివేస్తోంది. ఈ హృదయవిదారక ఘటనకు అందరూ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. చాక్లెట్ కొనిస్తానని మాయమాటలతో మభ్యపెట్టిన నిందితుడు, దారుణంగా అత్యాచారం చేసి చిన్నారిని హత్య చేయడం సామాజిక పరిణామాలను ప్రశ్నించే అంశమైంది. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఆమె మాట్లాడుతూ, “చిన్నారిపై జరిగిన అఘాయిత్యం బాధాకరం, అలిమేలు మంగాపురం ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఘటన తర్వాత పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు,” అని పేర్కొన్నారు.

Andhra Home Minister Vangalapudi Anita Calls for Justice

అనిత ఈ కేసు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. “నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం. కేసును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక కోర్టుకు అప్పగించబడుతుంది. మూడునెలల్లో ఈ కేసును పూర్తిచేసి నిందితుడికి శిక్ష అమలు చేయడమే మా లక్ష్యం,” అని అన్నారు. ఈ దారుణానికి కారణం మద్యం మత్తులో నిందితుడు వికృతంగా వ్యవహరించడం అని అనిత తెలిపారు. ఇలాంటి ఘోర ఘటనలు మరలా పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.

Also Read: Amy Jackson: మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న స్టార్ హీరోయిన్.. ఈసారి తండ్రి వేరేకోరు?

అనిత తన ప్రసంగంలో ఈ ఘటనను రాజకీయం చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. “ఈ ఘటనను రాజకీయం చేయడం విడ్డూరం. ఇలాంటి విషాద ఘటనలు చోటు చేసుకున్నప్పుడు బాధిత కుటుంబాలకు మద్దతుగా ఉండటం మన బాధ్యత. ఇది రాజకీయం చేసే విషయం కాదు,” అని ఆమె సూచించారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయలేదని, దుష్ప్రచారానికి దిగడం తగదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు జరిగాక ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని, పోలీసులు తమ విధుల్లో అప్రమత్తంగా ఉన్నారని వివరించారు.

“ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోవాలి. క్రైం రికార్డులు పరిశీలిస్తే గత ఐదేళ్లలో ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయి. పులివెందులలో కూడా మహిళపై అత్యాచారం జరిగితే, జగన్ నిందితుడిని శిక్షించారా?” అంటూ అనిత ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడమే ముఖ్యమని అనిత అభిప్రాయపడ్డారు.