Annapoornamma: ఇండస్ట్రీలో అమ్మ క్యారెక్టర్లకు,బామ్మ క్యారెక్టర్లకు, అత్త క్యారెక్టర్లకు కొంతమంది నటీమణులు పెట్టింది పేరుగా ఉంటారు. అలాంటి వారిలో నిర్మలమ్మ, అన్నపూర్ణమ్మ లాంటి సీనియర్ నటిమణులు ఉన్నారు. అయితే నిర్మలమ్మ ప్రస్తుతం మన ముందు లేకపోయినప్పటికీ అన్నపూర్ణమ్మ మాత్రం దాదాపు మూడు తరాల హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
Annapoornamma sensational comments
ఈమె ఇప్పటికీ కూడా బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి కామెడీ షో లలో చేస్తుంది. అయితే అలాంటి అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. ఇక నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలామంది ఆఫర్ ఇస్తాము కానీ మరి నాకేంటి అనే విధంగా అడిగేవారు. (Annapoornamma)
Also Read: Sunitha: సింగర్ సునీత అంటే ఆ స్టార్ యాంకర్ కి ఎందుకంత కోపం.. అమెరికాలో ఆ రాత్రి ఏం జరిగింది.?
ఇక ఆ భయంతో నేను 20 ఏళ్లకే పెళ్లి చేసుకొని 25 ఏళ్లకే తల్లి పాత్రలు చేయడం మొదలు పెట్టేసాను. ఇక సినిమా షూటింగ్స్ లో భాగంగా ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చేది. అప్పుడప్పుడు రాత్రి సమయంలో కూడా అక్కడే ఉండాల్సి వచ్చేది. ఆ టైంలో కొంతమంది చిల్లర వెధవలు మా రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొట్టేవారు.
అర్ధరాత్రి పూట వాళ్ళు చేసే పనులకు మేము చాలా భయపడి పోయే వాళ్ళం. ఇక ఎప్పుడైతే ఎయి** అనే వ్యాధి వచ్చిందో అప్పటినుండి చాలామంది పరాయివారితో ఆ పని చేయడానికి భయపడిపోయారు. ఆ వ్యాధి వచ్చాక ఇలాంటివి చాలా తగ్గిపోయాయి అంటూ అన్నపూర్ణమ్మ సంచలన కామెంట్లు చేసింది.(Annapoornamma)