ANR: అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజుల్లో ఎన్నో అవస్థలు పడి మరణించారు అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి.మరీ ముఖ్యంగా తన చివరి రోజుల్లో ఎవరిని కూడా తన దగ్గరికి రానివ్వలేదట. ఈ విషయాన్ని నటుడు కాదాంబరి కిరణ్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు వచ్చినా కూడా వారిని చూడడానికి అనుమతి ఇచ్చేవారు కాదట..
ANR gave the property papers to that heroine one minute before she died
అయితే ఏఎన్ఆర్ ఎందుకు అలా చేసేవారో మాత్రం అర్థం కాలేదని ఆయన బయటపెట్టారు. ఇక చివరి రోజుల్లో ఎంతో అవస్థపడి మరణించిన ఏఎన్ఆర్ తను చనిపోయే ఒక రోజు ముందు ఆ హీరోయిన్ ని పిలిచి ఆస్తి పేపర్లు అప్పగించారట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..ఎందుకు ఆమెకు ఆస్తి పేపర్లు ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం.. అక్కినేని నాగేశ్వరరావు తాను చనిపోయే ఒకరోజు ముందు హీరోయిన్ ని పిలిచారు అంటే ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆయన కోడలు అక్కినేని అమలనే..(ANR)
Also Read: Pilla Zamindar 2: నాని సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్.. ఇప్పుడు వర్కౌట్ అయ్యేనా!!
అయితే అమలని నాగార్జున పెళ్లి చేసుకోవడం నాగేశ్వరరావుకి మొదట ఇష్టం లేదు. కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా అమలపై అభిమానం పెంచుకున్నారు. అయితే కోడలుగా వచ్చిన కొత్తలో అమలను చాలా అవమానించేవారట. ముఖ్యంగా తనకి ఇష్టం లేకుండా చెప్పకుండా గుట్టుగా పెళ్లి చేసుకోవడంతో అమలని అంతగా ఇష్టపడేవారు కాదట. కానీ ఆ తర్వాత అమల వినయ విధేయతలకు ఆకర్షితుడైన ఏఎన్ఆర్ అమలని కన్నా బిడ్డ లాగా చూసుకునేవారట.
అయితే చివరి రోజుల్లో అమలని మొదట్లో వచ్చిన సమయంలో ఎలా చూసుకున్నారో అది గుర్తుకు వచ్చి ఏఎన్ఆర్ చాలా బాధపడిపోయి అమలని పిలుచుకొని నువ్వు మా ఇంటికి కొత్త కోడలుగా వచ్చిన సమయంలో నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ అమ్మా.. నన్ను క్షమించు..ఇప్పటినుండి ఈ ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి అంటూ ఆస్తి పేపర్లను అమల చేతిలో పెట్టారట.అలా చివరి రోజుల్లో అమల కూడా ఏఎన్ఆర్ ని చాలా బాగా చూసుకునేదట.(ANR)