ANR: కలెక్షన్ కింగ్ గా.. డైలాగ్ కింగ్ గా.. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న మోహన్ బాబు పై అక్కినేని నాగేశ్వరరావు సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఓ పెద్ద పిచ్చోడు అంటూ నాగేశ్వరరావు పబ్లిక్ గా మాట్లాడిన మాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. మరి ఇంతకీ నాగేశ్వరరావు మోహన్ బాబు ని పిచ్చోడు అని ఎందుకు మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం. నాగేశ్వరరావు ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో ఉండే కొంతమంది హీరోలు అంటే ఉదాహరణకు మోహన్ బాబు లాంటివారు ఒక సినిమా సక్సెస్ అయితే మందే ఇదంతా అనేలా కాలర్ ఎగరేసుకొని చెబుతారు.
ANR shocking comments on Mohan babu
మోహన్ బాబుని అంటున్నానని అనుకోకండి. మోహన్ బాబు నా మనసుకి చాలా దగ్గరరైనవాడు. అందుకే ఆ చనువుతో నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. మోహన్ బాబు ఎలాంటి వాడు అంటే ఎప్పుడైనా నేను అటుగా వెళితే నాకు నమస్కారం పెట్టండి అని అడుగుతాడు. పిచ్చివాడు కాదండి ఆయన. అలా ఎవరైనా నమస్కారం అడిగి మరీ పెట్టించుకుంటారా.. సర్లే అని నేను నమస్కారం పెడదామని అనుకున్నాను.(ANR)
Also Read: Allu Aravind: నీ మూవీతో నా కొడుకు జీవితం నాశనం అంటూ ఆ డైరెక్టర్ ని అవమానించిన అల్లు అరవింద్.?
ఇక కొంతమంది అయితే మనతో నమస్కారం పెట్టించుకోవడానికి తెలివిగా తల ఊపుతూ నమస్కారం పెట్టేలా చేసుకుంటారు.ఓహో ఆయన తల ఊపుతున్నాడంటే నమస్కారం పెడుతున్నాడు కాబట్టి మనం నమస్కారం పెట్టాలి అని మన నుండి నమస్కారం రిసీవ్ చేసుకుంటారు ఇది ఒక తెలివి. అంటూ మోహన్ బాబుని చూసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు నాగేశ్వరరావు.
అయితే మొదట్లో ఫన్నీగా మొదలుపెట్టిన ఈ సంభాషణ ఆ తర్వాత కాస్త సీరియస్గా అయ్యేసరికి అప్పటివరకు నవ్వుకుంటూ ఉన్న మోహన్ బాబు ఆ తర్వాత కాస్త అవమానంగా మొహం పెట్టారు. ఇక ఇదంతా మోహన్ బాబుని ఉద్దేశించి అన్నారా లేక మరే హీరోనైనా ఉద్దేశించి ఏఎన్ఆర్ కామెంట్స్ చేశారా అనేది తెలియదు.కానీ లైవ్ లో మాత్రం మోహన్ బాబు పరువు మొత్తం తీసేశారు ఏఎన్ఆర్.ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.(ANR)