TTD: టీటీడీ నూతన పాలక వర్గం మండలి ఏర్పాటు అయింది. ఈ తరునంలోనే… టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు 24 మంది సభ్యులతో టీటీడీ నూతన పాలక వర్గం ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు సర్కార్. అయితే.. చంద్రబాబు సన్నిహితులు చైర్మన్‌గా టీవీ5 చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు నియామకం అయ్యారు. TTD
AP govt appoints BR Naidu as new chairman of TTD
అటు సభ్యులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజుతో పాటు మరో 20 మందికి అవకాశం కల్పించారు. తెలంగాణ నుంచి 5 గురు, కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరి చొప్పున టీటీడీ పాలకమండలిలో అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు. TTD
Also Read: IPL 2025: చెన్నై రిటైన్ చేసే ఆటగాళ్లు వీరే.. ధోనీకి బిగ్ షాక్?
ఇక తిరుమల శ్రీవారి పాలక మండలిలో ఈ సారి సగం మంది పొరుగు రాష్ట్రాల వారికి అవకాశం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇక గత టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా వున్న కృష్ణమూర్తి, సౌరభ్ బోర్లకు మరోసారి అవకాశం కల్పించడం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. గతంలో పాలక మండలి సభ్యులుగా వున్న ప్రశాంతి రెడ్డి, జంగా కృష్ణమూర్తి, సుచిత్రా ఎల్లాకు మరోసారి అవకాశం కల్పించడం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది చంద్రబాబు నాయుడు సర్కార్. TTD