Sonakshi Sinha: ఏంటి సోనాక్షి సిన్హా పెళ్లయిన నెలకే భర్తతో గొడవలు ఏగలేకపోతోందా.. నిజంగానే ఆ విషయంలో ఇబ్బంది పడుతోందా.. అంత ఓపెన్ గా చెప్పేసిన సోనాక్షి భర్తతో చివరి వరకు ఉంటుందా అని చాలామంది జనాలు ఈమె మాటలు విని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతకీ సోనాక్షి సిన్హా భర్తకు సంబంధించిన ఏ విషయంలో ఇబ్బంది పడుతుందో ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో ఇంతే.. చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకునే వరకు వెళ్ళిపోతారు.
Sonakshi Sinha: Arguments with her husband within a month of marriage
అయితే తాజాగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట సోనాక్షి సిన్హా,జహీర్ ఇక్బాల్ లకి నిజంగానే ఆ విషయంలో గొడవలు జరుగుతున్నాయా అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ నటుడు శత్రజ్ఞ సిన్హ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సోనాక్షి సిన్హా.ఈమె బాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్ల ఒకరిగా పేరు తెచ్చుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తనకంటే వయసులో చిన్నవాడైన నటుడు జహీర్ ఇక్బాల్ తో ప్రేమలో పడి చాలా రోజులు డేటింగ్ చేసింది. ఇక ఈమె పెళ్లిలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. (Sonakshi Sinha)
Also Read: Raviteja: సడెన్ గా మిస్టర్ బచ్చన్ రావడం.. అతని మీద పగేనా!!
ఎందుకంటే మొదట వీరి పెళ్లికి శత్రుఘ్న సీన్హ ఫ్యామిలీ ఒప్పుకోలేదు. అయినప్పటికీ వెనకడుగు వేయలేదు. కాని చివరికి తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో వీరి పెళ్లికి వచ్చారు. ఇక సోనాక్షి సిన్హా పెళ్లిని చాలా సింపుల్ గా చేసేసుకుంది ఆ తర్వాత రిసెప్షన్ పార్టీని మాత్రం గ్రాండ్ గా అరేంజ్ చేసి ఎంతోమంది సెలబ్రిటీలను ఆహ్వానించింది.అలా వీరి పెళ్లి జూన్ 23న జరిగింది.అయితే తాజాగా పెళ్లైన నెల రోజులకే జహీర్ ఇక్బాల్ గురించి ఒక విషయం చెప్పింది సోనాక్షి.
అదేంటంటే.. జహీర్ ఇక్బాల్ కి సంబంధించి ఆ విషయంలో చాలా ప్రాబ్లం అవుతుందట. అదేంటంటే..జహీర్ కి మ్యూజిక్ వింటూ విజిల్స్ వేసే అలవాటు ఉంటుంది.ఇక ఆ విజిల్స్ వింటే పక్కన ఉన్నవారికి చాలా ఇబ్బంది కలుగుతుంది.ఈ విషయంలో నాకైతే చాలా చిరాకు వేస్తుంది.. అంటూ తన భర్తకు సంబంధించిన ఓ విషయాన్ని సోనాక్షి బయట పెట్టింది.దీంతో కొంతమంది నెటిజన్లు విజిల్స్ వేస్తే ఇప్పుడే చిరాకు వస్తుందా.. ముందు ఈ విషయం తెలియదా.. ఇన్ని రోజుల నుంచి ఎలాంటి చిరాకు రాలేదా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Sonakshi Sinha)