Aswini Dutt: వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత నిర్మాత అశ్వినీ దత్ అందరికీ తెలుసు. ఈయన అప్పట్లో ఎన్నో సినిమాలను తీసి స్టార్ నిర్మాతగా కొనసాగారు.ప్రస్తుతం ఆయన కూతుర్లు ఇద్దరు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.ఇక ఈ మధ్యనే వచ్చిన భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 ad మూవీకి కూడా ఈయన కూతుర్లే నిర్మాతలుగా చేశారు. అయితే ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ అశ్వినీ దత్ అల్లుడు అనే సంగతి అందరికీ తెలుసు.
Aswini Dutt who told the story behind Nag Ashwin’s sandals
అయితే ఈ సినిమా విడుదలై హిట్ టాక్ వచ్చాక అరిగిన చెప్పులను సోషల్ మీడియాలో పెట్టి నా నాలుగేళ్ల శ్రమ అని అర్థం వచ్చేలా ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం అని పోస్ట్ పెట్టాడు. దాంతో ఈ పోస్టు కాస్త నెట్టింట్లో వైరల్ అయింది. అయితే ఈ అరిగిన చెప్పుల గురించి తాజాగా అశ్వినీ దత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కల్కి 2898AD మూవీ తీశాక అందరి దృష్టిలో నాగ్ అశ్విన్ ఎంతో ఎత్తులో ఉన్నాడు. (Aswini Dutt )
Also Read: Deepika Padukone: దీపిక పదుకొనే చీర చాలా లగ్జరీ గురూ.. తయారీకి ఎన్ని వేల గంటలు పట్టిందంటే..?
కానీ నిజ జీవితంలో మాత్రం నాగి చాలా సింప్లిసిటీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. మా ఇంటికి నాగ్ వచ్చేటప్పుడు హడావిడిగా వచ్చి ఇంటి బయట చెప్పులు విడిచి వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత మళ్లీ ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో నా చెప్పులు వేసుకుని వెళ్తాడు. అలా ఆయన హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నాగ్ అశ్విన్ వాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పుడు కూడా ఆయన చెప్పులు కాకుండా వాళ్ళ నాన్న చెప్పులు వేసుకుని వస్తాడు
అంటూ నాగ్ అశ్విన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ఇంటర్వ్యూలో అశ్వినీ దత్ ఇంకా చాలానే విషయాలు తన అల్లుడి గురించి మాట్లాడి ఉంటారు. అయితే ప్రస్తుతం అశ్విని దత్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో హడావిడిలో మీ చెప్పులు వాళ్ళ నాన్న చెప్పులు వేసుకుంటారా ఇది నిజమేనా.. మరి నాలుగేళ్ల శ్రమ అంటూ అరిగిపోయిన చెప్పులు పెట్టారు. అవి నాగి చెప్పులు కాదా అంటూ నెటిజన్స్ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.(Aswini Dutt )