Avinash: జబర్దస్త్ ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయమై కమెడియన్స్ గా మంచి పొజిషన్లో ఉన్నారు. చాలామందికి జబర్దస్త్ ప్లాట్ఫారం ఒక మంచి లైఫ్ ని ఇచ్చింది. అయితే అలాంటి జబర్దస్త్ ద్వారా గుర్తింపు సాధించాక చాలామంది బిగ్ బాస్ రియాల్టీ షో కి వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇక అందులో ఒకరు ముక్కు అవినాష్ కూడా.. ముక్కు అవినాష్ బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే..
Avinash paid 10 lakhs for Bigg Boss chance
అయితే ఈ బిగ్ బాస్ షో కి వెళ్లడానికి ముందు 10 లక్షల ఫైన్ కట్టాల్సి వచ్చింది అంటూ ఎవరికి తెలియని ఒక షాకింగ్ విషయాన్ని అవినాష్ బయటపెట్టారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అవినాష్ మాట్లాడుతూ.. నేను జబర్దస్త్ లో కమెడియన్ గా చేస్తున్న సమయంలో బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది.అయితే జబర్దస్త్ నియమాల ప్రకారం ఈ షో బాడింగ్ లో ఎన్ని సంవత్సరాలు రాసుకుంటారో అన్ని రోజులు కచ్చితంగా ఇందులోనే చేయాలి.( Avinash)
Also Read: Allu Ramalingaiah: బియ్యం దొంగతనం చేసి వాళ్ళ అప్పు తీర్చిన అల్లు అర్జున్ తాత అంత కష్టం ఎందుకు..?
ఒకవేళ అనివార్య కారణాలవల్ల ఈ షో నుండి తప్పుకుంటే ఖచ్చితంగా ఫైన్ కట్టాలి. అలా బిగ్ బాస్ అవకాశం రావడంతో ఆ షో కి వెళ్లాలి అనే ఆసక్తితో జబర్దస్త్ వాళ్ళకి 10 లక్షల ఫైన్ కట్టాను. ఇక ఆ టైంలో నా దగ్గర పది లక్షల డబ్బు కూడా లేదు.దాంతో యాంకర్ శ్రీముఖి దగ్గర ఐదు లక్షలు అప్పు చేసాను.
మరో ఐదు లక్షల కోసం తెలిసిన వ్యక్తిని అప్పు అడిగాను. అలా పది లక్షలు అప్పు చేసి జబర్దస్త్ వాళ్ళకి కట్టాను. ఆ తర్వాత బిగ్ బాస్ వెళ్ళాక నాకు మంచి పేరు గుర్తింపు రావడమే కాకుండా ఫైనాన్షియల్ గా సెట్ అయ్యాను. ఈ షో తర్వాత ఎన్నో షోలలో అవకాశాలు వస్తున్నాయి అంటూ అవినాష్ చెప్పుకోచ్చారు.( Avinash)