Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి ఇప్పుడు… చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మళ్లీ అధికారంలోకి వస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి… ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయాడు.2024 అసెంబ్లీ ఎన్నికల్లో… వైసీపీ పార్టీకి కేవలం 11 స్థానాలే రావడం జరిగింది. అంతేకాకుండా నలుగురు ఎంపీలు మాత్రమే వైసిపి పార్టీ తరఫున గెలిచారు. Jagan
Ayyannapatra bumper offer to Jagan
దీంతో ఏపీలో అధికారం కోల్పోయింది వైసీపీ పార్టీ. ఇక ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీ పార్టీని తెలుగుదేశం తమ్ముళ్లు.. చాలా వేధిస్తున్నారు. అడుగడుగునా వైసిపి నేతలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.అలాగే కేసులు కూడా పెడుతున్నారు. Jagan
Also Read: Jagan: మోడీపై జగన్ తిరుగుబాటు.. బెంగళూరులో రాహుల్ తో చర్చలు ?
అయితే ఇలాంటి నేపథ్యంలో… ప్రతిపక్ష హోదా దక్కని జగన్మోహన్ రెడ్డికి ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అదిరిపోయే శుభవార్త చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని బాధపడకూడదు అని తెలిపారు. కానీ పులివెందుల ఎమ్మెల్యేగా ఏపీ అసెంబ్లీకి రావాలని అయ్యన్నపాత్రుడు కోరడం జరిగింది. Jagan
టిడిపి ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లుగానే చాన్స్ జగన్మోహన్ రెడ్డికి కూడా అసెంబ్లీలో ఇస్తామని తెలిపారు. సమయం ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి తన సమస్యలన్నీ అసెంబ్లీలో చెప్పవచ్చని వెల్లడించారు. అలాగే వైసిపి ఎమ్మెల్యేలు కూడా కచ్చితంగా అసెంబ్లీకి హాజరై తమ సమస్యలను చెప్పాలని కోరారు అయ్యన్నపాత్రుడు. Jagan