Babar Azam: ఇంగ్లాండ్ తో జరిగిన ముల్తాన్ టెస్టులో బాబర్ అజామ్ రెండు ఇన్నింగ్స్ లోను బ్యాటింగ్ చేయలేదు. తొలి ఇన్నింగ్స్ లో 30 పరుగులు మాత్రమే చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో ఐదు పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జోరుట్, కేన్ విలియమ్సన్ తో బాబర్ అజామ్ సరితూగ లేడని సల్మాన్ బట్ అన్నారు. గత 18 టెస్టు ఇన్నింగ్స్ లో బాబర్ హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. Babar Azam

Babar Azam eats 5 types of animals

అతను డిసెంబర్ 2022లో న్యూజిలాండ్ పై తన చివరి టెస్ట్ లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఇదిలా ఉండగా….క్రికెటర్లు చాలా వరకు డైట్ ఫాలో అవుతారు. ఫిట్ గా ఉండడానికి ఎన్నో కసరత్తులు చేస్తారు. ముఖ్యంగా వారి ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే బాబర్ అజామ్ అతని డైట్ లో ఎలాంటి ఆహారం తీసుకుంటాడనే వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో తాజాగా వైరల్ అవుతుంది. Babar Azam

Also Read: IND vs NZ 2024: టెస్టు సిరీస్… హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

బాబర్ అజామ్ మాంసాహార ప్రియుడు అనే సంగతి తెలిసిందే. ఈ పాకిస్తానీ క్రికెటర్ దాదాపు ప్రతిరోజు తన భోజనంలో మాంసం తినడానికి ఆసక్తిని చూపిస్తాడు. బాబర్ అజామ్ ప్రతిరోజు ఐదు రకాల జంతువుల మాంసాన్ని తింటాడని ఇటీవలే పాకిస్తానీ మీడియాలో చాలా రకాల వార్తలు వచ్చాయి. ఈ వార్తల ప్రకారం అతను ఐదు రకాల జంతువుల మాంసాన్ని ప్రతిరోజు తింటాడు. బాబర్ అజామ్ ముఖ్యంగా మేకలు, కోడి మాంసం, గొర్రెలు, చేపలు, గొడ్డు మాంసం తింటాడని వెల్లడించారు. ప్రతిరోజు ఇదే ఆహారాన్ని తింటూ ఉంటాడట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. Babar Azam