Balakrishna Akhanda 2 - Tandavam Set for Pan-India Release

Akhanda 2: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడానికి సిద్ధమవుతోంది. వీరిద్దరూ కలిసి చేస్తున్న నాలుగో చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత ఈ కాంబోపై ప్రేక్షకుల్లో భారీ నమ్మకం ఏర్పడింది. ఇప్పుడీ హిట్ జోడీ ‘అఖండ 2’ అనే సీక్వెల్ తో ప్రేక్షకులను అలరించబోతోందన్నది విశేషం.

Balakrishna Akhanda 2 – Tandavam Set for Pan-India Release

2021లో విడుదలైన ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం, బోయపాటి శ్రీను ప్రతిభకు మరో రుజువుగా నిలవనుంది. అఘోర పాత్రలో బాలకృష్ణ నటన, థమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణలు. ఇప్పటికే ఈ సీక్వెల్ పై అధికారిక ప్రకటన వచ్చింది, Hyderabad లో ఈరోజు ఘనంగా ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈ సందర్భంలో సినిమా టైటిల్ పోస్టర్‌ను కూడా 14 రీల్స్ ప్లస్ సంస్థ విడుదల చేసింది.

Also Read: Rice Cooker: ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో వండిన అన్నం తింటే ప్రమాదమేనా ?

‘అఖండ 2 – తాండవం’ అనే పవర్‌ఫుల్ టైటిల్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది, గత చిత్రం విజయానికి సంగీతం ప్రధాన హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్న, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.