Thaman: ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర సంగీత దర్శకుడుగా ఉన్నాడు తమన్. ‘అల వైకుంఠపురంలో’ సినిమా తరువాత ఆయన ఏ సినిమాకు సంగీతం అందించిన కూడా అది సూపర్ హిట్ అవుతుంది. ఈ నేపథ్యంలో తమన్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో కూడా భావిస్తూ ఉన్నారు. ఇది సహజమే అయినా ఓ హీరో మాత్రం వరుస పెట్టి తన సినిమాలకు దర్శకుడుగా ఎంచుకోవడం నిజంగా ఆయన అభిమానులను ఎంతగానో సంతోష పరుస్తుంది.
Balakrishna Changing thaman From His Movie
అయితే ఓ హీరో నటించే అన్ని సినిమాలకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. అన్ని సినిమాలకు ఒకే సంగీత దర్శకుడు అయితే బోర్ కొడుతుందని అనుకున్నాడో ఏమో ఆ హీరో మాత్రం తన తదుపరి సినిమాకు ఈ సంగీత దర్శకుడుని మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయనెవరో కాదు నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా నటిస్తున్న గత నాలుగు సినిమాలుగా తమన్ సంగీతం సమకూరుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న బాబీ దర్శకత్వంలోని సినిమాకి కూడా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆ విధంగా బాలకృష్ణ సినిమాకు వరుసగా సంగీతం సమకూరుస్తూ వచ్చిన తమన్ ను ఈసారి మార్చాలని ఆ హీరో భావిస్తున్నాడు.
Also Read: Hanuman2: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మాములుగా లేదే!!
ఆయన చేయబోయే తదుపరి సినిమా కోసం ‘యానిమల్’ చిత్రం యొక్క సంగీత దర్శకుడుని పెట్టుకోబోతున్నాడట బాలకృష్ణ. రణబీర్ కపూర్ నటించిన ఈ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం యొక్క సంగీతానికి కూడా భారీ స్థాయిలోనే పేరు వచ్చింది. అందుకే బాలయ్య ఈ తెలుగు సంగీత దర్శకుడైన హర్షవర్ధన్ రామేశ్వర్ ను సంగీతం అందించాలని కోరారట. అయన తెలుగు వాదనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అందులోనూ ఆయన తెలుగులో చేసింది కూడా చాలా తక్కువ సినిమాలే. హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు తెలియకపోయినా కూడా ఈయన సంగీతం అందరికీ తెలుసు. ఆ విధంగా ఈ సంగీత దర్శకుడుని తన తదుపరి సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాడు బాలకృష్ణ. మరి ఆ చిత్రం ఏ దర్శకుడుతో ఉంటుందో చూడాలి మరి.