Balakrishna: నందమూరి బాలకృష్ణ టైం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లపై తన అక్కసు వెళ్ళగక్కుతూనే ఉన్నారు. అయితే ఇది నేను అంటున్న మాట కాదు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల అభిమానులు బాధతో ఎమోషనల్ గా అంటున్న మాటలు.. ఎన్టీఆర్ కళ్యాణ్‌రామ్ లకి పెద్ద దిక్కులేదు ..పెద్ద దిక్కు అయినటువంటి తండ్రి చనిపోవడంతో ఈ భాద్యతలన్నీ బాలకృష్ణ బాబాయ్ చూసుకోవాలి.
Balakrishna comments on NTR are viral
కానీ బాలకృష్ణ మాత్రం ఆ ఇద్దరిని దూరం పెడుతూ అసలు వాళ్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ అన్నలకు దగ్గరగా ఉన్నప్పటికీ బాబాయి బాలకృష్ణ మాత్రం అన్న కొడుకులిద్దరినీ దూరం పెడుతూ అందరితో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు బాలకృష్ణతో ఎంత కలవాలని చూసినా ఎంత దగ్గరికి రావాలని చూసినా కూడా బాలకృష్ణ వారిని దూరమే పెడుతున్నారు. (Balakrishna)
Also Read: Jani Master Case: జానీ మాస్టర్ పై తల్లి కూతుర్ల కుట్ర.. ఇది కొత్త కోణం బాసూ!!
అయితే అలాంటి బాలకృష్ణ తాజాగా తన వారసుడి గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. రీసెంట్ గా దుబాయ్ కి ఐఫా అవార్డ్స్ కోసం వెళ్లిన బాలకృష్ణ ని జీ తెలుగు చీఫ్ ఎడిటర్ భరత్ ఇంటర్వ్యూ చేయగా అందులో షాకింగ్ విషయాలు బయట పెట్టారు. ఇక తన సినిమాల గురించి తన కొడుకు సినీ ఎంట్రీ గురించి అన్ని మాట్లాడిన బాలకృష్ణ చివరిగా మీ సినీ వారసుడు ఎవరు అని భరత్ అడగగా.. కచ్చితంగా నా సినీ వారసుడు మోక్షజ్ఞ..అలాగే నా మనవడు మనవరాళ్లు అవుతారు అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.
అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ సినిమాల్లో మీ అన్న కొడుకులు ఇద్దరూ కూడా ఉన్నారు కదా..వాళ్ళు కూడా మా వారసులే అంటే మీ సొమ్మేం పోతుంది.. ఎందుకు వారిని మరీ అంతలా దూరం పెడుతున్నారు అంటూ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ ల అభిమానులు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు వాళ్లు నందమూరి వారసులు కాదా వాళ్ళతో మీకు ఎలాంటి సంబంధం లేదా అని తిట్టిపోస్తున్నారు.(Balakrishna)