Balakrishna Set to Play Superhero in Upcoming Movie

Balakrishna: నందమూరి బాలకృష్ణ తెలుగు మాస్ సినిమాలకు ఒక బ్రాండ్. ఆయన సినిమా అంటే థియేటర్లు దద్దరిల్లుతాయి. బాలయ్య నటన, డైలాగ్ డెలివరీ అంటే అభిమానులు పూనకాలు లోడింగ్ అంటారు. ప్రస్తుతం ఆయన సూపర్ హీరోగా నటించబోతున్నారని వస్తున్న వార్తలు ఫ్యాన్స్‌ను ఉత్సాహంతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

Balakrishna Set to Play Superhero in Upcoming Movie

అక్టోబర్ 11న బాలకృష్ణ సూపర్ హీరోగా కనిపించబోయే సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ సినిమాలో ఆయన ఏ పాత్రలో కనిపిస్తారో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ గతంలో సూపర్‌మేన్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే, కాబట్టి బాలయ్య కూడా అలాంటి పాత్రనే పోషిస్తారా అన్న చర్చ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ అయింది.

Also Read: NTR: ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారిపోయింది.. ఆడియెన్స్ పై ఎన్టీఆర్ ఘరమ్..గరం..!!

బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఆయన హీరోగా మాత్రమే కాకుండా, సంఘసేవకుడిగా, రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. “అన్‌స్టాపబుల్” టాక్‌ షోతో ఆయన తనలోని మరో వైపును కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఇప్పుడు సూపర్ హీరో పాత్రలో బాలకృష్ణ ఎలా కనిపిస్తారో చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆయకెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని, బాలయ్య తన ప్రేక్షకులను మళ్ళీ మంత్ర ముగ్ధులను చేస్తారని అందరూ ఆశాభావంతో ఉన్నారు.