Balineni Srinivasa Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత… వైసిపికి అనేక క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం 11 స్థానాలు మాత్రమే వైసిపి దక్కించుకోగలిగింది. నాలుగు పార్లమెంట్ స్థానాలు మాత్రమే వైసిపి దక్కించుకుంది. దీంతో వైసీపీలో ఉన్న కీలక అలాగే మాజీ ప్రజా ప్రతినిధులు అందరూ పక్క చూపులు చూస్తున్నారు. Balineni Srinivasa Reddy
balineni srinivasa reddy good bye to jagan
ఇప్పటికే చాలామంది వైసిపి నేతలు… ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లారు. అయితే కూటమి గేట్లు తెలిస్తే అందులో జంప్ అయ్యేందుకు రెడీగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి మరో ఊహించని షాక్ తగిలింది. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని బహిరంగంగానే.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారట. Balineni Srinivasa Reddy
Also Read: Ys Jagan: జగన్ చేతిలోనూ రెడ్ బుక్..ఇక టీడీపీ నేతలు జైలుకే ?
త్వరలోనే పార్టీకి రాజీనామా చేయబోతున్నారట బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఒంగోలు ఎన్నికల కౌంటింగ్ విషయంలో.. తనకు జగన్మోహన్ రెడ్డి సహాయం చేయలేదని అలిగారట బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఈ విషయాన్ని తాజాగా జగన్మోహన్ రెడ్డి ముఖం మీద చెప్పారట. అంతేకాకుండా తన కార్యకర్తలతో సమావేశం నిర్వహించి త్వరలోనే వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్లు వెల్లడించారు. ఒకవేళ వైసిపికి బాలినేని రాజీనామా చేస్తే జనసేనలోకి వెళ్తారని సమాచారం. Balineni Srinivasa Reddy