Bandi Sanjay: తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో గులాబీ పార్టీ 39 స్థానాలకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. దీంతో అప్పటినుంచి… గులాబీ పార్టీని వరుసగా బడా లీడర్లు వీడిపోతున్నారు. ఇప్పటికే 9 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. Bandi Sanjay
bandi sanjay comments on harish rao
మరి కొంతమంది హైదరాబాద్ నగరానికి చెందిన గులాబీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు… బిజెపి పార్టీలో చేరతారని… కొంతమంది వార్తలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై తాజాగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. Bandi Sanjay
Also Read: Kcr: కేసీఆర్ కు బిగ్ షాక్.. 9 మంది ఎమ్మెల్యేలు జంప్.. ఇక కాంగ్రెస్ లో BRS విలీనమే?
గులాబీ పార్టీలో మంచి మనిషి ఎవరైనా ఉన్నారంటే.. కేవలం హరీష్ రావు మాత్రమే అని కొనియాడారు. గులాబీ పార్టీలో..మంచి నాయకుడు హరీష్ రావు మాత్రమేనని తెలిపారు.అలాంటి హరీష్ రావు.. బిజెపి పార్టీలో చేరితే.. మంచిదేనన్నారు. అయితే హరీష్ రావు బీజేపీలోకి రావాలంటే ఒక కండిషన్ పెడుతున్నామని బండి సంజయ్ తెలిపారు. Bandi Sanjay
హరీష్ రావు బిజెపిలోకి రావాలంటే ఫస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని… బండి సంజయ్ వివరించారు. లేకపోతే హరీష్ రావు కాదు కదా ఏ నాయకుడు వచ్చినా తాము చేర్చుకోబోమని..స్పష్టం చేశారు. గులాబీ పార్టీకి చెందిన ఏ లీడర్ వచ్చినా కచ్చితంగా రాజీనామా చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కచ్చితంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. Bandi Sanjay