Bheems Ceciroleo Composes Mass Hit for Gopichand Vishwam

Gopichand Vishwam: మాచో స్టార్ గోపీచంద్ తన తాజా చిత్రం “విశ్వం”తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను టిజి విశ్వ ప్రసాద్ మరియు వేణు డోనేపూడిలు భారీ స్థాయిలో నిర్మించారు. సినిమా విజువల్ ట్రీట్‌గా ఉండబోతుందని అంటున్నారు. ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలను కలిగి ఉందని అంటున్నారు.

Bheems Ceciroleo Composes Mass Hit for Gopichand Vishwam

ఈ చిత్రంలో గోపీచంద్‌కు జోడీగా అందాల తార కావ్య తాపర్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ జంట మధ్య కెమిస్ట్రీపై మంచి చర్చ జరుగుతోంది, ముఖ్యంగా “గుంగురు గుంగురు” పాట విడుదల తర్వాత సినిమా పై క్రేజ్ మరింత పెరిగింది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాపులర్ మాస్ సాంగ్‌లో గోపీచంద్, కావ్య తాపర్ చేసిన డ్యాన్స్ మూవ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలోని, సాహిత్యం, సినిమాకు మంచి క్రేజ్ ను తీసుకొస్తూ ప్రేక్షకులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

Also Read: Ys Jagan: వైఎస్‌ జగన్‌ కు 16 నెలల జైలు శిక్ష ?

“విశ్వం” ట్రైలర్ హాస్యంతో పాటు రక్తికట్టే యాక్షన్ సన్నివేశాలను సమర్పిస్తూ, సినిమాపై అంచనాలను మరింత పెంచింది. గోపీచంద్ పాత్రలో కనిపించే తీవ్రమైన నటన మరియు శ్రీను వైట్ల శైలి కామెడీని మేళవించిన విధానం ప్రేక్షకులకు వినోదం పంచడం ఖాయం.

ఇప్పటికే భారీ అంచనాలతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ చిత్రం, ఈరోజు థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి పెద్ద క్రేజ్ ఉన్న ఈ సినిమాను మిస్ కాకుండా చూడాల్సిందే!