Bhuvneshwar Kumar: ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. ఈ వేలంలో భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా పాల్గొననున్నారు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న భువనేశ్వర్, ఈ సీజన్‌లో జట్టుకు అతన్ని రిటెన్ చేయకపోవడంతో, ఆయన ఇప్పుడు ఇతర ఫ్రాంచైజీలకు అందుబాటులో ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాదుకు అతి ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా భువనేశ్వర్ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
Bhuvneshwar Kumar to Spice Up IPL 2025 Auction
భువనేశ్వర్ కుమార్‌కు ఉన్న అనుభవం మరియు టాలెంట్ ను చాలా టీమ్ లు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపధ్యంలో, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ వంటి అగ్ర టీమ్స్, భువనేశ్వర్‌ను తమ కైవసం చేసుకునేందుకు పోటీపడుతున్నాయి. ఈ టీమ్స్ ఆలోచనల ప్రకారం, భువనేశ్వర్ జట్టులోకి వస్తే వారి బౌలింగ్ లైనప్ బలపడుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ తుషార్ దేశ్‌పాండే మరియు శార్దూల్ ఠాకూర్‌లను విడుదల చేసిన తరువాత, బౌలింగ్ విభాగంను మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. చెపాక్ పిచ్ భువనేశ్వర్ బౌలింగ్ కు అద్భుతంగా సరిపోతుంది. ఆయన స్పీడ్, స్వింగ్‌తో చెన్నై తరఫున మైదానంలో ఆకట్టుకోగలడు.
Also Read: Pushpa 2: పుష్ప 2 .. కోసం పుష్ప 1 ను బాగానే వాడుతున్నారు గా!!
ముంబై ఇండియన్స్ కూడా జస్ప్రీత్ బుమ్రాకు సరైన భాగస్వామి కావాలని చూస్తున్న నేపథ్యంలో భువనేశ్వర్‌ను లక్ష్యంగా చేసుకుంది. భువనేశ్వర్ మరియు బుమ్రా కలిసి బౌలింగ్ చేస్తే, ముంబై జట్టు మరింత బలంగా మారే అవకాశం ఉంది. గుజరాత్ టైటాన్స్ కూడా మహ్మద్ షమీ మరియు ఉమేష్ యాదవ్ వంటి అగ్ర బౌలర్లను విడుదల చేసిన గుజరాత్, కొత్త బౌలర్ల కోసం వెతుకుతోంది. భువనేశ్వర్ కుమార్ రాక గుజరాత్ జట్టుకు కీలకం అని చెప్పాలి. భువనేశ్వర్ కుమార్‌ను ఏ జట్టు తీసుకుంటుందో మరియు దానికి ఎంత మొత్తాన్ని ఖర్చు చేస్తుందో తెలియాలంటే, ఐపీఎల్ 2025 మెగా వేలం జరిగిన తరువాత మాత్రమే స్పష్టం అవుతుంది.