Aishwarya Rai: మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ పర్సనల్ లైఫ్ గురించి గత కొద్ది రోజులుగా జాతీయ మీడియా ఛానల్స్ లో ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో ఐశ్వర్య రాయ్ ఉండలేకపోతుందని, అందుకే భర్తతో కలిసి వేరు కాపురం పెడతానని చెప్పినప్పటికీ భర్త దానికి ఒప్పుకోవడం లేదని, దీంతో గత కొద్ది రోజులుగా భర్తకు దూరంగా ఉంటూ విడాకులకి అప్లై చేసింది అంటూ ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అత్తింట్లో అత్త, ఆడపడుచుతో ఐశ్వర్యారాయ్ కి ప్రతి విషయంలో గొడవలు వస్తున్నాయని, ఈ కారణంతోనే ఐశ్వర్యరాయ్ భర్తకు కూడా దూరం అవ్వాలని నిర్ణయం తీసుకుందని జాతీయ మీడియా ఛానల్లో రూమర్స్ వైరల్ అయ్యేసరికి ఐశ్వర్య అభిషేక్ లు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ మీడియాలో వార్తలు గుప్పు మన్నాయి.
Big B family insulted Aishwarya Rai Senior actress warning
దాంతో ఐశ్వర్య రాయ్ విడాకుల గురించి గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా బిగ్ బీ ఫ్యామిలీ ఐశ్వర్యని పట్టించుకోకపోవడం,విడాకుల రూమర్స్ వీటన్నింటిపై ఓ సీనియర్ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.మరి ఆ నటి ఎవరు? ఎవరికి వార్నింగ్ ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. రీసెంట్ గా ఐశ్వర్యరాయ్ కి ఐఫా అవార్డు వచ్చిన సమయంలో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ స్పందించలేదని, నిజంగానే కోడలతో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయి అని కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. (Aishwarya Rai)
Also Read: IIFA Awards: అన్ని ఈవెంట్ లలో నాని కే అవార్డు ఎలా.. పైడ్ మాఫియా నా!!
అయితే ఈ ప్రచారాలన్నింటిపై ఓ నటి ఫైర్ అయింది.ఆమె ఎవరో కాదు సిమీ గరేవాల్ .. గత కొద్ది రోజులుగా ఐశ్వర్య అభిషేక్ లు విడాకులు తీసుకోబోతున్నారు అని ఎన్నో వార్తలు వైరల్ చేస్తున్నారు. ఇవి నేను కూడా చూస్తూనే ఉన్నాను. కానీ అంతగా పట్టించుకోలేదు. అయితే ఈ మధ్యకాలంలో ఈ రూమర్స్ మరీ హద్దులు దాటాయి. దాంతో నేను స్పందించకుండా ఉండలేకపోతున్నాను.
అసలు అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ గురించి మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు. ఇంకొకసారి ప్రచారం చేస్తే బాగుండదు అంటూ ఫైర్ అయింది. అయితే సిని గరేవాల్ వ్యాఖ్యలపై కొంతమంది మండి పడుతున్నారు. మీరు ఎందుకు వారి ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవు అని చెబుతున్నారు.మరి వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు అని కామెంట్లు పెడుతున్నారు.(Aishwarya Rai)