Konda Vishweshwar Reddy: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత… కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే… ఇప్పటికే గులాబీ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. Konda Vishweshwar Reddy
BJP MP Konda Vishveshwar Reddy into Congress
అయితే ఇప్పుడు… బిజెపి పార్టీ పైన రేవంత్ రెడ్డి కన్ను పడినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఈటెల రాజేందర్ పై కన్వేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పైన కన్ను వేసినట్లు తెలుస్తోంది. చేవెళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయన గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బిజెపికి వెళ్లారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. Konda Vishweshwar Reddy
Also Read: Peddireddy Ramachandra Reddy: పెద్దిరెడ్డికి బిగ్ షాక్… పుంగనూరులో ఉప ఎన్నికలు ?
అయితే మొదటి నుంచి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కొండ విశ్వేశ్వర్ రెడ్డికి పేరు ఉంది. అయితే తాజాగా హైడ్రాను మెచ్చుకుంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో మల్కాజిగిరి ఎంపీ… ఈటల రాజేందర్ మాత్రం హైడ్రా నువ్వు తీవ్రంగా వ్యతిరేకించారు. Konda Vishweshwar Reddy
దీంతో ఒకే పార్టీలో ఉన్న కొండ విశ్వేశ్వర్ రెడ్డి అలాగే ఈటల రాజేందర్ వేర్వేరు ప్రకటనలు చేయడంతో… బిజెపి నేతలు గందరగోళంలో పడ్డారు. అయితే కొండ విశ్వసిస్తే రెడ్డి చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో త్వరలోనే ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారని వార్తలు వస్తున్నాయి. Konda Vishweshwar Reddy