BMW EV Scooter: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. టు వీలర్ అలాగే ఫోర్ వీలర్ కూడా విపరీతంగా మన ఇండియన్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో… ఈ పరిస్థితి నెలకొందని… వ్యాపారవేత్తలు చెబుతున్నారు. BMW EV Scooter
BMW Motorrad to launch its first EV in India on July 24
దీంతో చాలా రకాల కంపెనీలు… కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. పెట్రోల్ వాహనాలకు సమానంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా వాటిపై డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… ప్రముఖ బీఎండబ్ల్యూ కీలక ప్రకటన చేసింది. బీఎండబ్ల్యూ సీఈ 04 పేరుతో కొత్త స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురాబోతున్నట్లు కంపెనీ ప్రకటన చేసింది. BMW EV Scooter
Also Read: Maruti Fronx Velocity Edition: మార్కెట్లోకి మరో మారుతి కారు.. రూ.7.29 లక్షలు మాత్రమే.!
ఇక ఈ బైక్ ఫీచర్స్ అలాగే ధర వివరాలు తెలుసుకుందాం. ఇక ఈ బిఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ బైక్ 231 కిలోల బరువు ఉండే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ బైక్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 130 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది అని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. BMW EV Scooter
ముఖ్యంగా 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ బైక్ దూసుకు వెళ్తుందట. అలాగే… జీరో నుంచి 80% చార్జింగ్ ఎక్కడానికి దాదాపు గంట సమయం తీసుకుంటుందట ఈ బైక్. ఈ బైక్ కు ఏ ఎస్ సి, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా వస్తుందని అధికారులు తెలిపారు. ఈ బైకుకు 10.25 ఇంచుల స్క్రీన్ కూడా అందిస్తున్నారు. ఇందులో 8.9kwh బ్యాటరీ కూడా ఉంటుంది. అయితే ఈ బైక్ ధర వివరాలు మాత్రం ప్రకటించలేదు. నెక్స్ట్ మంత్ ఈ బైక్ రిలీజ్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయట. BMW EV Scooter