Bollywood: సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాలు ఇప్పుడు సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ, వీటి వెనుక ఉన్న సవాళ్లను చాలామంది నటులు ఎదుర్కొన్నారు. మన సమాజంలో ఈ సన్నివేశాలను బోల్డ్‌గా, వివాదాస్పదంగా పరిగణిస్తారు. బాలీవుడ్లో ఈ ట్రెండ్ ఇప్పటికే హద్దులు దాటినప్పటికీ దక్షిణ భారత చిత్రాల్లో కూడా లిప్ లాక్ సన్నివేశాలు సాధారణం అయిపోతున్నాయి. అయినప్పటికీ, ఇలాంటి సన్నివేశాలపై నటీనటుల అభిప్రాయాలు విభిన్నంగా ఉండడం గమనార్హం.
Bollywood Most Difficult Lip Lock Moments
చిత్రీకరణ ప్రక్రియలో ఈ సన్నివేశాలు ఎంత కష్టతరంగా ఉంటాయో చాలామంది వెల్లడించారు. ఉదాహరణకు, అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ జంటగా నటించిన ‘రాజా హిందూస్థానీ’ చిత్రంలోని లిప్ లాక్ సన్నివేశాన్ని షూట్ చేసేందుకు మూడు రోజులు పట్టిందని చెప్పుకోవచ్చు. దర్శకుడు ధర్మేష్ దర్శన్ తన చిత్రాల్లో పర్ఫెక్షన్కి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడంతో, ఈ సన్నివేశానికి 47 టేకులు తీసుకున్నారట. ఈ సన్నివేశం తలుచుకుంటే కరిష్మా కపూర్ తనకెంత చేదు అనుభవమో ఎదురైందో అనుకునేదట. ఈ విషయాలు తెలిసిన ప్రేక్షకులకు ఈ సన్నివేశం వెనుక ఎంత కష్టం దాగి ఉందో అర్థమవుతుంది.
Also Read: IPL 2025 Auction: ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ప్లేయర్లు వీళ్ళే ?
ఇలాంటి అనుభవాలు కేవలం కరిష్మా కపూర్ కే పరిమితం కాలేదు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రముఖ నటీమణులు కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా కూడా లిప్ లాక్ సన్నివేశాలను ఇష్టపడరని నిస్సందేహంగా వెల్లడించారు. ఇక మరొకవైపు మాధురి దీక్షిత్, దీపికా పదుకొనే వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఇటువంటి సన్నివేశాలను పూర్తి చేయడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారట. రన్బీర్ కపూర్, కత్రినా కైఫ్ వంటి రియల్ లైఫ్ జంట కూడా స్క్రీన్‌పై లిప్ లాక్ సన్నివేశాలకు ఎంతో కష్టాన్ని అనుభవించారట. అలా వారు ఈ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఇబ్బందులు పడ్డారట.
లిప్ లాక్ సన్నివేశాలు నటీనటులకు మానసికంగా ఎన్నో సవాళ్లు తెస్తాయి అనేది వారు చెబుతున్న అభిప్రాయాలను స్పష్టంగా కనబడుతుంది. వీటిని తామూ తేలిగ్గా చేయలేమని పలువురు తేల్చి చెప్పారు. అయినప్పటికీ, సినిమా అనేది కళా ప్రపంచం కాబట్టి, ప్రేక్షకుల కోసం, దర్శకుడు కోరిన విధంగా కొన్ని సన్నివేశాలు చేస్తేనే తమ పాత్రకు న్యాయం చేయగలమని పలువురు నటులు అభిప్రాయపడుతుంటారు. దానికోసం వారు చేయాల్సిందే.