Janasena: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీ పార్టీలో ఉన్న కీలక నేతలు ఇప్పటికే చాలామంది పార్టీ మారిపోయారు. ఇలాంటి నేపథ్యంలో బొత్స సత్యనారాయణ, వైసిపి ఎమ్మెల్యేలు జనసేన లోకి వెళ్ళనున్నట్లు సమాచారం. ఈ మేరకు… ఏపీ మంత్రి నాదెండ్ల తో చర్చలు జరుగుతున్నాయట. Janasena

botsa satyanarayana into janasena party

మొదటగా బొత్స సత్యనారాయణ… జనసేన పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. ఆయన వెళ్లిన నెల రోజులు లేదా పది రోజులు లోపు… వైసిపి నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు… జనసేన పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి ఎదిగే పరిస్థితి లేదని ఈ నేతలు అందరు భావిస్తున్నారట. Janasena

Also Read: Revanth Reddy: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి బిగుసుకున్న ఉచ్చు..?

అందుకే టిడిపి అలాగే భారతీయ జనతా పార్టీ కాకుండా జనసేన అయితే కరెక్ట్ అని భావిస్తున్నారని సమాచారం. అందుకే వైసిపి పార్టీని వీడిన నేతలందరూ… నేరుగా జనసేనలోకి వెళ్తున్నారు. వాసవంగా జనసేన పార్టీలో బలమైన క్యాడర్ లేదు. దమ్మున్న లీడర్ ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడ మొత్తుకున్నా పవన్ కళ్యాణ్ మాత్రమే మాట్లాడాలి. కాబట్టి జనసేన పార్టీలో భారీగా.. స్పేస్ ఉంది. అందుకే వైసిపి నేతలందరూ జనసేనలోకి వెళ్లి భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు. Janasena