BRS: అది రేవ్ పార్టీ కాదు… ఫ్యామిలీ పార్టీ..అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద గౌడ్ క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్ బామ్మర్ది ఫాంహౌజ్ లో జరిగిన పార్టీపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద గౌడ్ స్పందించారు. కేటీఆర్ ను ఇరికించాలని…రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని… హామీలు ఇచ్చి మాట తప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహించారు. కేటీఆర్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద గౌడ్. BRS
BRS Clarity On Janwada Party
రేవంత్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ తగ్గుతోందని… కేటీఆర్ పై అసూయతో వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి దూషణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద గౌడ్. కేటీఆర్ బావమరిది స్వంత ఇంట్లో కుటుంబ సభ్యులతో పార్టీ ఏర్పాటు చేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు. స్వయంగా రాజ్ పాకాల ఇంటికి పోలీసులు,ఆబ్కారీ వాళ్ళు వెళ్లి సెర్చ్ చేశారని వెల్లడించారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టారని నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద గౌడ్. BRS
Also Read: Smita Sabharwal: స్మితా సబర్వాల్‌కు రేవంత్ బంపర్ గిఫ్ట్.. ?
అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని… రిటైర్ అయినా మేము అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెట్టిన అధికారులను వదలబోమని హెచ్చరించారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద గౌడ్. రేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని… స్వంత ఇంట్లో పార్టీ చేసుకోవద్దా అని ప్రశ్నించారు. పంచనామా రిపోర్టులో ఫారెన్ లిక్కర్ ఉన్నట్లు తేలిందని… మా ఎమ్మెల్యే ఇటీవల ప్రయివేటు పార్టీకి వెళ్లి వస్తుంటే ఇరికించే ప్రయత్నం చేశారన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద గౌడ్. BRS