BJP: తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేగింది. తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రస్తుత భారత రాష్ట్ర సమితి పార్టీ.. కనుమరుగు కాబోతుందని… సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గులాబీ పార్టీని… భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారని… RTV అధినేత రవి ప్రకాష్ సంచలన వీడియో పెట్టారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పెను సంచలనం చోటు చేసుకుంది. BJP
BRS Party merged with BJP
తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారం కోల్పోయిందని… ఎంపీ ఎన్నికల్లో జీరో స్థానాలకు పడిపోయిందని… ఆర్ టి వి అధినేత రవి ప్రకాష్ పేర్కొన్నారు. అలాగే… కల్వకుంట్ల కవితను కాపాడుకునేందుకు… గులాబీ పార్టీని… విలీనం చేసేందుకే కల్వకుంట చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారని… ఓ పెద్ద ప్రోగ్రామే నడిపించారు రవి ప్రకాష్. BJP
Also Read: Bangladesh: బంగ్లా అల్లర్ల వెనుక పాకిస్తాన్ కుట్రలు….? మోడీ బిగ్ స్కెచ్..!
అయితే రవి ప్రకాష్ చేసిన ఈ వీడియో పై… 24 గంటల్లోపే గులాబీ పార్టీ స్పందించింది. RTV అధినేత రవి ప్రకాష్ కు.. స్ట్రాంగ్ కౌంటర్ గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. 24 సంవత్సరాల పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన పార్టీ గులాబీ పార్టీ అని తెలిపారు. ప్రాణం పోయే వరకు.. తెలంగాణ కోసమే గులాబీ పార్టీ పనిచేస్తుందన్నారు. BJP
అలాంటిది గులాబీ పార్టీ… భారతీయ జనతా పార్టీలో విలీనం అనేది… పెద్ద తప్పు వార్త అని ఫైరయ్యారు కేటీఆర్. అలాంటి వార్తలు ప్రచురించిన వారు వెంటనే.. క్లారిటీ ఇవ్వాలని లేకపోతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. అనవసరంగా తప్పుడు వార్తలు రాసి.. ప్రజలను గందరగోళం పరిస్థితులకు నెట్టకూడదని కోరారు. BJP