Rashmika Mandanna: పెద్ద హీరోల సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించాలనేది హీరోయిన్ ల కోరిక. ఆ విధంగా మొదటి సినిమా నుంచి హిట్ లు అందుకుంటూ ప్రేక్షకులను అలరించి క్రేజ్ సంపాదించుకుని ఇప్పుడు వరుస పెద్ద సినిమా అవకాశాలను ఆదుకుంటూ ఉంటుంది రష్మిక మందన్న. ఇటు తెలుగులో అటు బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆమె నటించిన రెండు సినిమాలు ఇప్పుడు ఒకే రోజున విడుదల కాబోతూ ఉండడం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచే విషయం అని చెప్పాలి.
Can Rashmika Mandanna Handle the Pressure of Two Blockbusters on the Same Day?
గతంలో కొంతమంది మాత్రమే ఈ ఫీటును సాధించారు. ఇప్పుడు వారి అందరి సరసన రష్మిక నిలవబోతోంది. ఆమె హీరోయిన్ గా నటించిన పుష్ప2 చిత్రం డిసెంబర్ 6వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా నిర్మాతలు ఇప్పటికే ఇచ్చేశారు. ఆ డేటుకు తగ్గట్టుగానే ఈ సినిమా యొక్క షూటింగ్ ను పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చిత్ర బృందం వేగవంతం చేస్తున్నారు. రకరకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ దర్శకుడు సుకుమార్ ఈ డేట్ ను ఎట్టి పరిస్థితులను మిస్ కాకూడదు అనే లక్ష్యంతో పని చేస్తున్నారట.
Also Read: Yuvraj Singh: యువరాజ్ బయోపిక్.. వెండితెర రారాజు ఎవరు?
కాబట్టి దాదాపు ఈ సినిమా డిసెంబర్ 6 వ తేదీన విడుదల కావడం ఖాయం అని చెప్పాలి.ఇక ఆమె హీరోయిన్ గా నటించిన మరొక ప్రతిష్టాత్మక చిత్రం ‘చావా’ కూడా అదే రోజున విడుదల కాబోతుంది చత్రపతి శివాజీ కథ ఆధారంగా భారీ బడ్జెట్లో రూపొందిన ఈ హిస్టారికల్ మూవీలో విక్కీ కౌశల్ హీరో గా నటించగా రష్మిక చేసిన పాత్రకు తప్పకుండా మంచి గుర్తింపు రావడం ఖాయం అని చెబుతున్నారు. యానిమల్ సినిమా తర్వాత ఆమెకు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. అంతకుముందు కొన్ని సినిమాల్లో చేసినప్పటికీ ఆమెకు సరైన బ్రేక్ రాలేదని చెప్పాలి.
అయితే యానిమల్ నుంచి ఆమెకు ఇప్పుడు క్రేజ్ భారీగా పెరిగిపోవడంతో పాటు పలు పెద్ద హీరోల సినిమాల అవకాశాలు కూడా వస్తున్నాయట. అలాంటి సమయంలో ఈమె నటించిన రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కావడం ఆమె కెరీర్ కు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి. పుష్ప2 సినిమాకు కోసం నార్త్ లో ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలలో ఏది ఆమెకు మంచి పేరు తీసుకు వస్తుందో చూడాలి.