AP: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అలాగే బీహార్ రాష్ట్రాల గురించే చర్చ జరుగుతుంది. మంగళవారం కేంద్ర ప్రభుత్వం.. బడ్జెట్ ను లోక్సభలో పెట్టడం జరిగింది. కేంద్ర బడ్జెట్ 48 లక్షల కోట్ల పరిమాణం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ బడ్జెట్ లో… చాలా వరకు నిధులు బీహార్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే పెట్టినట్లు… స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. AP

Center names for AP 15 thousand crores given to Amaravati is all debt

నితీష్ కుమార్ పార్టీ అలాగే టిడిపి పార్టీ కారణంగా… మొన్న మోడీ ప్రభుత్వం నిలబడింది. ఈ రెండు పార్టీలు లేకుంటే అసలు ఎన్డీఏ ప్రభుత్వం రాకపోయేది. ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక నిధులను, అలాగే ఫుల్ సపోర్ట్ ను బడ్జెట్ ద్వారా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం 15 వేల కోట్లు కేటాయించినట్లు నిర్మల సీతారామన్ పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. AP

Also Read: KCR: కేసీఆర్ కు ఊపిరి పోసిన మేడిగడ్డ… ఇక అసెంబ్లీలో అడుగుపెట్టనున్న సింహం ?

అయితే దీనిపై వైసీపీ ప్రస్తుతం కౌంటర్ వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి రాజధాని కోసం… కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్లు కేటాయించలేదని… అవి కేవలం అప్పు మాత్రమే అని.. వైసిపి చెబుతోంది. అమరావతి కోసం 15 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ అలాగే ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని… అదంతా పూర్తి అవాస్తవాన్ని.. వైసీపీ అంటుంది. AP

15 వేల కోట్లు… తెచ్చుకుంటే.. షూరిటీ మాత్రమే కేంద్రం ఇస్తామని చెప్పిందని… ఈ విషయం తెలియక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అలాగే ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని… వైసిపి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. ఇకనైనా ఏపీ ప్రజలను మోసం చేయకుండా.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సంపాదించాలని… వైసిపి డిమాండ్ చేస్తోంది. AP