Jamili Elections: కేసీఆర్, జగన్ ను దెబ్బకొట్టేందుకు చంద్రబాబు స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలని బాంబ్ పేల్చారు సీఎం చంద్రబాబు. జమిలీ ఎన్నికలకు దేశం మొత్తం మద్దతు తెలిపాలని కోరారు చంద్రబాబు. ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానం వల్ల ప్రజలకు, రాష్ట్రాలకు మేలు జరుగుతుందని వెల్లడించారు చంద్రబాబు. హర్యానాలో మూడోసారి బీజేపీ గెలవడం కేంద్ర సుపరిపాలనకు నిదర్శనమన్నారు. Jamili Elections
Chandrababu Comments On Jamili Elections
ఎన్ని అపోహలు, ప్రచారాలు జరిగినా హర్యానా, జమ్మూ కాశ్మీరులో మంచి పరిపాలనపై నమ్మకం తోనే ఎన్డీఏ గెలిపించారని వివరించారు చంద్రబాబు. ఉదయం ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపానని… జమ్మూ కశ్మీరులో బలమైన పార్టీగా బీజేపీ అవతరించిందన్నారు చంద్రబాబు. చెప్పే విధానం సరిగ్గా ఉండి, చేసేది మంచైనప్పుడు మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. మహారాష్ట్ర, జార్ఖండ్లలో త్వరలో జరిగే ఎన్నికల్లో కూడా ఈ తరహా ఫలితాలే వస్తాయని విశ్వసిస్తున్నానని చెప్పారు చంద్రబాబు. Jamili Elections
Also Read: Anchor Shyamala: పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో “జానీ”లు ఎక్కువయ్యారు ?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీనే అతి పెద్ద అరిష్టమంటూ ఆగ్రహించారు చంద్రబాబు. వల్గారిటీకి వైసీపీ మారు పేరుగా ఉందని తెలిపారు. జమిలీ ఎన్నికలు జరిగితే నష్టమేంటీ..? అంటూ జగన్ పై ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అయిపోయి ఉంటే బాగుండేదని.. ఎన్నికలన్నీ ఒకేసారి జరిగితే.. అభివృద్ధి కార్యక్రమాలు.. పాలనపై ఫోకస్ పెట్టొచ్చు అని తెలిపారు. రూ. 500 నోట్లు కూడా ఉండకూడదని కోరారు. వాస్తవంగా జమిలీ ఎన్నికలు జరిగితే.. కేసీఆర్, జగన్ లాంటి ప్రాంతీయ పార్టీలు గెలవడం కష్టం. కూటమిలో టీడీపీ ఉంది కనుక.. చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. Jamili Elections