Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027లోనే ఏపీలో ఎన్నికలు జరగబోతాయని, అనూహ్యంగా వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ఆదివారం వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సోమవారం ట్విట్టర్‌లో మరింత వేడి వ్యాఖ్యలు చేస్తూ, నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.
Chandrababu Make Nara Lokesh the Next AP Chief Minister
విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లో టీడీపీ నేతలు 2027 జమిలి ఎన్నికల వరకు ఎలా బతకాలో తాపత్రయపడుతున్నారని విమర్శించారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడంపై టీడీపీ దృష్టి పెట్టిందని, అందుకే దోపిడీలు, మోసాలు, ఇతర అరాచక కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రజల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని అన్నారు.
Also Read: Sreeleela: అప్పుడలా.. ఇప్పుడిలా.. శ్రీ లీల పై సోషల్ మీడియా లో భారీ ట్రోలింగ్!!
చంద్రబాబు మతిమరుపుతో బాధపడుతూ లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని యత్నిస్తున్నారని, అంతర్గత కలహాలతో టీడీపీ కూటమిలో అవినీతి పరంగా వాస్తవ సమస్యలు తలెత్తుతున్నాయని విజయసాయిరెడ్డి విమర్శించారు. క్రమశిక్షణ లేని టీడీపీ నాయకత్వం, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అరాచకాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు కేంద్రంలో సుస్థిరత కల్పించుకోవాలని యోచిస్తున్నట్లు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
జమిలీ ఎన్నికల నేపథ్యంలో 2027 నాటికి ఏపీలో మధ్యంతర ఎన్నికలు అనివార్యమని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన చిత్తూరు, తిరుపతి జిల్లాల వైసీపీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలు ఎన్నికల కోసం బూత్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.