Chandrababu Naidu Addresses Corruption Allegations in TDP

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు నేడు అత్యవసరంగా టీడీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అవుతుండడం పలు కారణాల వలన ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు రావడంతో, ముఖ్యంగా ఇసుక దందా మరియు మద్యం వ్యాపారాల్లో వారు పాల్గొంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించడం కీలకంగా మారింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో సభ్యులకు గట్టిగా క్లాస్ పీకేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

Chandrababu Naidu Addresses Corruption Allegations in TDP

తాజాగా, ఉచిత ఇసుక విధానాన్ని కొందరు ఎమ్మెల్యేలు నవ్వుల పాలు చేస్తున్నారని చంద్రబాబు దృష్టికి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఉచితంగా ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినా, కొంతమంది మాఫియాలతో చేతులు కలిపి పెద్ద ఎత్తున కమీషన్లు దండుకుంటున్నారని ఆయనకు సమాచారం అందింది. ఈ చర్యల వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందన్న ఆందోళనతో చంద్రబాబు నాయుడు అత్యవసరంగా ఈ సమావేశాన్ని పిలిపించారు.

Also Read: Rishabh Pant: రిషబ్ పంత్ కు మరో ఎదురుదెబ్బ ?

ఇక, చిత్తూరు, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 18 మంది ఎమ్మెల్యేల పైనే ఎక్కువగా ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా, ఇసుక మరియు మద్యం వ్యాపారాల్లో బినామీల ద్వారా దందాలు సాగిస్తున్నారని చంద్రబాబుకు నిఘా వర్గాల నుండి విశ్వసనీయమైన సమాచారం అందినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, తమ ఆగడాలు ఆపకుంటే గట్టిగా హెచ్చరించబోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించి, పార్టీ క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంచనా వేయబడుతోంది.