Chiranjeevi: కల్కి మూవీ గురించి మనందరికీ తెలిసిందే. కల్కి 2898 ఏడి సినిమాకి ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్ వస్తుందంటం పై మెగాస్టార్ చిరంజీవి స్పందించాడు. నా ఫేవరెట్ ప్రోడ్యూసర్ కు శుభాకాంక్షలు అంటూ అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. కల్కి సినిమా గురువారం (జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సంపాదించడంపై చిరంజీవి చేసిన ట్రీట్ వైరల్ అవుతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీ దత్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్ ను అతడు బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఈ ట్వీట్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ మొత్తానికి చిరు శుభాకాంక్షలు చెప్పాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొన్, కమల్ హాసన్ లాంటి వాళ్లు నటించిన కల్కి 2898 ఏడి మూవీ ప్రేక్షకులకు తెగ వచ్చేసినట్టు తొలిరోజే సోషల్ మీడియా పోస్టులు, రివ్యూలు చూస్తే స్పష్టమవుతోంది.
Also Read: Kalki 2898 AD: కల్కి మూవీ హిట్ అవ్వడానికి కారణం ఆ సెంటిమెంట్ హీరోనే..?
ఈ సినిమాను పలువురు సెలబ్రిటీలు కూడా చూసి ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా చిరంజీవి కూడా దీనిపై స్పందించాడు. అతడు ఈ సినిమా చూడకపోయినా…అందరి పొగడ్తలు వింటుండె చాలా ఆనందంగా ఉందని చెప్పాడు.”కల్కి 2898 ఏడి గురించి అద్భుతమైన రిపోర్టులు వినిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపిక, కమల్ హాసన్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ తో ఇలాంటి మైథలాజికల్ సై ఫి ఫ్యూచరిస్టిక్ సినిమా తీసిన నాగ అశ్విన్ క్రియేటివ్ జీనియస్ కు అభినందనలు. నా ఫేవరెట్ ప్రోడ్యూసర్ అశ్వినీదత్ గారికి, ఎంతో అభిరుచి కలిగిన, ధైర్యవంతులైన స్వప్న దత్, ప్రియాంక దత్, ఈ షునత సాధించిన మొత్తం టిమ్ కునా శుభాకాంక్షలు. ఇలా కలలు కంటూనే ఉండండి. (Chiranjeevi)
ఇండియన్ సినిమా పతాకాన్ని మరింత పైకి ఎగరేస్తూనే ఉండండి” అని చిరంజీవి స్వీట్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో మరుపురాని సినిమాలు వైజయంతి మూవీస్ బ్యానర్లోనే నిర్మతమయ్యాయి. మొదట 1990 లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ చిరు కెరిర్లో ఓ ఆల్ డైమ్ హిట్. ఆ తర్వాత కూడా చూడాలని ఉంది, ఇంద్ర, జై చిరంజీవ లాంటి సూపర్ హిట్ సినిమాలు చిరు, వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చాయి. నాగ అశ్విన్ డైరెక్ట చేసిన కల్కి 2898 ఏడి మూవీ పై ఇప్పటికే ధర్మకధీరుడు రాజమౌళి కూడా ప్రశంసాల వర్షం కురిపించిన విషయం తెలిసింది. ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తొలిరోజే రూ.200 కోట్ల ఓపెనింగ్ ఖాయమని భావిస్తుండగా..ఈ పాజిటివ్ టాక్ తో ఫాస్ట్ వీకెండ్ రికార్డులు కూడా బ్రేకయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.