Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నిజంగానే అమ్మాయిల మోజులో పడి సొంత తమ్ముడి ప్రాణాల మీదకు తీసుకువచ్చాడా.. అసలు వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉంది.. చిరంజీవికి ఎలాంటి అలవాటు కూడా ఉందా అనేది ఇప్పుడు చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రాకముందు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆయన పాల్గొన ప్రతి ఇంటర్వ్యూలో బయటపడుతూ ఉంటారు. అయితే ఈయన చిన్నతనంలో ఎన్నో చిలిపి పనులు చేసేవారట. అలా సింగర్ స్మితకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. నేను చిన్నతనంలో అంటే నిక్కర్ వేసుకునే వయసులో ఓసారి నా ఫ్రెండ్స్ తో కలిసి ఈతకు వెళ్లాను.
Chiranjeevi who fell in love with girls
ఆ సమయంలో నా తమ్ముడు నాగబాబు కూడా నాతో వచ్చాడు. అలా మేం ఈత కొడుతున్న సమయంలో అటుగా కొంతమంది అమ్మాయిలు వచ్చి రేగు పళ్ళు కోసుకుంటున్నారు.దాంతో నా చూపు సడన్గా అమ్మాయిల వైపు తిరిగింది. ఇక అదే టైంలో నా తమ్ముడు నాగబాబుకి ఈత రాక చెరువులో కిందికి మీదికి లేస్తూ ప్రాణ భయంతో అరుస్తున్నాడు. కానీ నేను అది ఏది పట్టించుకోకుండా ఆ అమ్మాయిల్ని చూస్తూ ఉన్నాను. దాంతో సడన్గా ఆ అమ్మాయిలా చూపు నుండి నా తమ్ముడి మాటలు నా చెవికి వినిపించాయి. (Chiranjeevi)
Also Read: Namitha: ఆ హీరో కోసం సూసై** చేసుకోవాలనుకున్న నమిత..?
అయ్యో నేను ఎంత తప్పు చేశాను అని నా తమ్ముడు దగ్గరికి వెళ్లి వాడిని ఒడ్డుకు తీసుకువచ్చాను. దాంతో నా తమ్ముడు నాగబాబుకి ఏమీ కాలేదు.ఇక ఆ టైంలో నేను ఊపిరి పీల్చుకున్నాను.ఒకవేళ వాడికి ఏదైనా జరిగితేనా నా సంగతి ఇక అంతే. ఇక ఎప్పుడైతే అమ్మాయిలని చూస్తూ తమ్ముడి ప్రాణాల మీకు తెచ్చానో అప్పటినుండి అమ్మాయిలని చూడడం మానేశాను. అమ్మాయిలని చూడాలంటేనే నాకు ఆ సంఘటన గుర్తుకు వచ్చేది.
అలా చాలా రోజులు అమ్మాయిలు కనబడితే తల కిందికి వేసుకొని వెళ్లేవాడిని.ఇక నేను కాలేజ్ డేస్ లో ఉన్న సమయంలో బస్సులో అమ్మాయిలు ఎక్కితే వారికి సీటు ఇచ్చి నేను పక్కకు తప్పుకునేవాడిని.అయితే ఆ సమయంలో నేను అలా ఎందుకు చేసే వాడిని అంటే ఆ వంకతోనైనా ఆ అమ్మాయిలు నా వైపు చూస్తారని. కానీ విచిత్రం ఏంటంటే.. చాలామంది నన్ను జెంటిల్మెన్ అనుకొని ఉండేవారు.తప్ప నా వైపు మాత్రం ఒక్కరు చూసేవారు కాదు అంటూ ఆనాటి సంగతులను చిరంజీవి గుర్తుచేసుకొని నవ్వుకున్నారు.(Chiranjeevi)